Home న్యూస్ చిరు ప్లేస్ లో రాజశేఖర్….ఏమవుతుందో ఏమో!!

చిరు ప్లేస్ లో రాజశేఖర్….ఏమవుతుందో ఏమో!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వేవ్ ల కారణంగా ఎప్పుడు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో అన్నది క్లారిటీ లేకుండా పోయింది, రిలీజ్ డేట్స్ కొన్ని నెలల ముందే అందరూ బుక్ చేసుకుని కూర్చోవడం, వేవ్ లు వచ్చి ఆ డేట్స్ అన్నింటినీ కూడా చెల్లాచెదురు చేసి మళ్ళీ కొత్త డేట్స్ అనౌన్స్ చేసేలా చేయడం, మళ్ళీ టైం బాలేక పొతే ఆ డేట్స్ కి మళ్ళీ వేవ్ లు వచ్చి…

డేట్స్ ని మళ్ళీ మారేలా చేస్తూ ఉండటం లాస్ట్ 2 ఏళ్ల నుండి జరుగుతూనే ఉంది, ఇక ఇప్పుడు 3rd వేవ్ ఎంటర్ అవ్వడంతో సంక్రాంతి రావాల్సిన పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ లు పోస్ట్ పోన్ అవ్వగా ఫిబ్రవరిలో కూడా వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ని…

ఆల్ రెడీ అనౌన్స్ చేశాయి కానీ ఇప్పుడు ఈ వేవ్ ఇంపాక్ట్ వలన ఆ సినిమాల డేట్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యి తీరాల్సిన టైం రాగా ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ స్పెషల్ రోల్ లో నటించిన ఆచార్య సినిమా ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున రిలీజ్ ను…

సొంతం చేసుకోవాల్సి ఉండగా ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం. ఆ సినిమా ప్లేస్ లో ఇప్పుడు యాంగ్రీ మాన్ రాజ శేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ శేఖర్ సినిమా ఫిబ్రవరి 4న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుందని సమాచారం. ఈ సినిమాను ముందు సంక్రాంతికి అనుకున్నారు కానీ చిన్న సినిమాల మధ్య పోటి….

మరీ ఎక్కువ అవ్వడం వలన ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని ఇప్పుడు చిరు మూవీ ప్లేస్ లో ఫిబ్రవరి 4న రిలీజ్ కాబోతుందని సమాచారం. ఇక మెగాస్టార్ ఆచార్య సినిమా ఆడియన్స్ ముందుకు పరిస్థితులు మళ్ళీ నార్మల్ అయ్యాకే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. మరి అది ఎప్పుడు జరుగుతుంది అన్నది మాత్రం మరింత టైం తర్వాతే క్లారిటీ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here