సీనియర్ హీరో రాజశేఖర్ రీసెంట్ గా కరోనా ని జయించి ఫ్యామిలీ తో హ్యాప్పీగా ఉన్నారు, పూర్తిగా కోలుకున్న రాజశేఖర్ ఇక సినిమాల మీద ఫోకస్ పెట్టారని సమాచారం. త్వరలోనే ఓ క్రేజీ మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు రాజశేఖర్. తన అప్ కమింగ్ మూవీ ని సీనియర్ డైరెక్టర్ నీలకంఠ డైరెక్షన్ లో చేయబోతున్న విషయం రీసెంట్ గా కన్ఫాం అయిన విషయం అందరికీ తెలిసిందే.
కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు రాజశేఖర్ కానీ అటు నీలకంఠ కానీ క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు అవుతుంది, రాజశేఖర్ నటించిన సినిమాల్లో రీసెంట్ గా చేసిన గరుడ వేగ కానీ కల్కి గాని మంచి పేరు సొంతం చేసుకున్న కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం…
కాసులు రాల్చడంలో విఫలం అయ్యాయి, రాజశేఖర్ చివరి సారి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 12 ఏళ్ళు అవుతుంది, 2008 లో గోరింటాకు సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రాజశేఖర్ తర్వాత ఇప్పటి వరకు హిట్ సినిమా అందుకొనే లేదని చెప్పాలి.
ఇక డైరెక్టర్ నీలకంఠ కూడా మిస్సమ్మ సినిమా తర్వాత మళ్ళీ హిట్ అందుకోలేదు… ఇలాంటి టైం లో ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో కొత్త కథతో సినిమా అనుకున్నా ఆలా కాకుండా రెండేళ్ళ క్రితం మలయాళం లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన జోసెఫ్ సినిమాను తెలుగు రీమేక్ హక్కులను..
సొంతం చేసుకుని ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. నలుగురు రిటైరైన పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ జోసెఫ్… రాజశేఖర్ కి బాగా సెట్ అవుతుంది అని ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేయగా వచ్చే ఇయర్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది అంటున్నారు. మరి ఈ సినిమాతో ఇద్దరూ కంబ్యాక్ సొంతం చేసుకోవాలని కోరుకుందాం…