Home న్యూస్ 12 ఏళ్ల క్రితం మాయ…. గ్రాఫిక్స్ అనుకున్నాం కదయ్యా…ఇంత షాక్ ఇచ్చారేంటీ!!

12 ఏళ్ల క్రితం మాయ…. గ్రాఫిక్స్ అనుకున్నాం కదయ్యా…ఇంత షాక్ ఇచ్చారేంటీ!!

0

2010 లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను తట్టుకుని అల్టిమేట్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో…. శంకర్ నుండి వచ్చిన లాస్ట్ అవుట్ స్టాండింగ్ మూవీ ఇదే అని చెప్పాలి. తర్వాత చేసిన సినిమాలు రోబో 2.0 తో సహా రోబో రేంజ్ లో అయితే అంచనాలను అందుకో లేక పోయాయి. ఇక రోబో సినిమా రెండేళ్ళ టైం మాత్రమె తీసుకుని నిర్మాణం కంప్లీట్ చేసుకుంది.

కాగా సినిమా మొదలు పెట్టిన తర్వాత ఒక ఫోటో ని ప్రీ లుక్ గా రిలీజ్ చేశారు. ఆ లుక్ చూసిన వాళ్ళు అందరూ రోబో ని గ్రాఫికల్ గా ఎంత బాగా డిసైన్ చేశారు అని అనుకున్నారు. అదే నిజం అనుకుని 12 ఏళ్లుగా భావిస్తూనే ఉన్నారు.

కానీ 12 ఏళ్ల తర్వాత అసలు నిజం తెలిసింది. అసలు ఏమాత్రం గ్రాఫిక్స్ వాడకుండా ఫోటో షూట్ తోనే ఈ డిసైన్ ని చేశారట. రజినీకాంత్ కి ఓ వైట్ పెయింట్ వేసి సాంపిల్ ఫోటోలు తీసి ఫోటో టెస్ట్ నచ్చడం తో సినిమా ముందుకు సాగిందట. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కహాని మొత్తం బయటికి వచ్చింది.

ఇది చూసినవాళ్ళు అందరూ ఆ టైం లో ఇది కూడా గ్రాఫిక్స్ అనుకున్నాం కదయ్యా అనుకుంటున్నారు. కానీ ఇది ఏమాత్రం గ్రాఫిక్స్ వాడకుండా తీసిన ఫోటో అని తేల్చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్  తెలుగు భాషల్లో అల్టిమేట్ కలెక్షన్స్ ని వసూల్ చేసిన రోబో ఇప్పటికీ టాప్ 10 తమిళ్ మూవీస్ లో…

అలాగే టాప్ 10 తెలుగు డబ్ మూవీస్ లిస్టులో కూడా టాప్ 5 ప్లేసులలో ఉండటం విశేషం అనే చెప్పాలి. తమిళ్ తెలుగు కలిపి 180 కోట్ల రేంజ్ షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా 10 ఏళ్ల క్రితం చరిత్ర తిరగరాసి ఇండియా లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here