Home న్యూస్ రజినీ దర్బార్ జపాన్ కలెక్షన్స్….ఇదేమి బ్యాటింగ్ సామి!!

రజినీ దర్బార్ జపాన్ కలెక్షన్స్….ఇదేమి బ్యాటింగ్ సామి!!

2029
0

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఆల్ ఇండియా లెవల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇక్కడతో పాటు రజినీ కి సూపర్ ఫాలోయింగ్ ఓవర్సీస్ లో కూడా ఉండగా వేరే దేశాల్లో జపాన్ లో రజినీ కి ఫాలోయింగ్ మరో లెవల్ లో ఉంటుంది అని చెప్పాలి. అక్కడ సూపర్ స్టార్ మూవీస్ కి ఉండే మ్యానియా మరో లెవల్ అనే చెప్పాలి. రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా ఒకప్పుడు ఇక్కడ…

ఊహకందని రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. అలాంటి రికార్డుల తర్వాత రజినీ మూవీస్ దాదాపు అన్నీ వీలు ఉన్నప్పుడు అల్లా అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అయ్యేవి. లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ నటించిన దర్బార్ సినిమా తెలుగు అండ్ తమిళ్ లో మొత్తం మీద అంచనాలను అందుకోలేక పోయింది.

సినిమా తెలుగులో 15 కోట్ల టార్గెట్ కి 10 కోట్లే వసూల్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా 147 కోట్ల టార్గెట్ కి 101.29 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమె సాధించి ఫ్లాఫ్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ రీసెంట్ గా…

190 మిలియన్ యెన్స్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందట ఇప్పటి వరకు… 190 మిలియన్స్ అంటే డాలర్స్ లో అనుకోకండి… జపాన్ యెన్ రేటు మన రూపాయితో పోల్చితే 68 పైసలు మాత్రమె… అంటే మొత్తం మీద 190 మిలియన్ యెన్స్ కి ఈ సినిమా ఇండియన్ కరెన్సీ లో ఆల్ మోస్ట్ 12.92 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఈ కలెక్షన్స్ కూడా…

ఏమాత్రం తక్కువ కావనే చెప్పాలి. 25 ఏళ్ల కిందట వచ్చిన రజినీ ముత్తు సినిమా అక్కడ ఆల్ మోస్ట్ 400 మిలియన్ యెన్స్ ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఆ రికార్డ్ ఇప్పటికీ అలాగే ఉండగా ఇక్కడ ఫ్లాఫ్ అయిన దర్బార్ సినిమా ఇప్పుడు అక్కడ సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుండటం చూసి లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు చేసిన చేయొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here