Home గాసిప్స్ ఓరినీ…రజినీకాంత్ కొత్త సినిమా కథ రాజశేఖర్ సినిమా నుండి తీసుకున్నారట…ఏ సినిమా అంటే!

ఓరినీ…రజినీకాంత్ కొత్త సినిమా కథ రాజశేఖర్ సినిమా నుండి తీసుకున్నారట…ఏ సినిమా అంటే!

3504
0

సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, కబాలి లాంటి ప్రీ రిలీజ్ సెన్సేషనల్ హుఫోరియా మళ్ళీ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సొంతం చేసుకోలేదు, ఆ రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే సినిమా కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ప్రస్తుతం రజినీకాంత్ తన అప్ కమింగ్ మూవీ తో….

మళ్ళీ అలాంటి ప్రీ రిలీజ్ హైప్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందీ అని అనిపిస్తున్న సినిమా అన్నట్టే…. విశ్వాసం సినిమాతో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న శివ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా పై కోలివుడ్ లో అల్టిమేట్ హైప్ ఉంది అని చెప్పొచ్చు.

కాగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీ లో ఒక ఆసక్తి కరమైన స్టొరీ చక్కర్లు కొడుతుంది, ఆ కథ ప్రకారం సినిమా స్టొరీ చాలా వరకు ఇది వరకే వచ్చిన ఒక సినిమా నుండి తీసుకుని దానికి కొన్ని మార్పులు చేర్పు కమర్షియల్ హంగులు జోడించారు అంటూ చెప్పుకుంటున్నారు.

ఆ స్టొరీ ప్రకారం సినిమా కథ తెలుగు లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా రూపొందిన మా అన్నయ్య సినిమా కథ నుండి తీసుకున్నారని, తమ్ముళ్ళ కోసం కష్టపడే అన్నగా ఈ కథ ఉంటుందని, పల్లెటూరి నేపధ్యం లో ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. చాలా వరకు మా అన్నయ్య చాయలు ఈ కథ లో ఉంటాయని అంటున్నారు. శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా…

ఫ్యామిలీ, ఎమోషన్స్, కొన్ని కమర్షియల్ హంగులు అలాగే రజినీ సాలిడ్ మ్యానరిజమ్స్ తో కలగలపి రూపొందుతున్న సినిమా అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ దీపావళి టైం లో సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి లీక్ అయిన వార్తా ప్రకారం ఈ కథ నిజమో కాదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here