Home గాసిప్స్ 2 బాక్ టు బాక్ డిసాస్టర్లు…కొత్త సినిమా లుక్ కూడా రాలేదు…అయినా తెలుగు లో దుమ్ము...

2 బాక్ టు బాక్ డిసాస్టర్లు…కొత్త సినిమా లుక్ కూడా రాలేదు…అయినా తెలుగు లో దుమ్ము లేపే బిజినెస్ ఆఫర్!

1492
0

హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అందని క్రేజ్ సూపర్ స్టార్ రజినీ కి సొంతం, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గదు, తెలుగు లో ఈ మధ్య సూపర్ స్టార్ రజినీ మూవీస్ పెద్దగా అంచనాలను అందుకోలేదు… రోబో తర్వాత రజినీ చేసిన సినిమాలు అన్నీ కూడా తెలుగు లో హిట్ గీత ని అందుకోలేదు, కబాలి అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా టాక్ దారుణంగా ఉండటం తో తేరుకోలేక పోయింది.

తర్వాత చేసిన సినిమాల మార్కెట్ భారీగా తగ్గగా రోబో 2.0 సినిమా ఒక్కటే మళ్ళీ భారీ కలెక్షన్స్ ని అందుకున్నా హిట్ కాలేదు.. ఇక గత రెండేళ్లుగా రజినీ చేసిన పేట మరియు దర్బార్ లు రెండూ సంక్రాంతి బరిలో దిగగా పోటి లో తెలుగు సినిమాలను తట్టుకోలేక…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ సినిమాలుగా నిలిచాయి. అయినా ఇప్పుడు రజినీ అప్ కమింగ్ మూవీ కి తెలుగు లో మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. సెకెండ్ వేవ్ ని తట్టుకుని కూడా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ కి వచ్చేలా ఉందని టాక్ వినిపిస్తుంది..

ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవ్వని ఈ సినిమా కి సాలిడ్ ఆఫర్స్ వస్తుండటం విశేషం… తెలుగు లో కూడా రజినీ సినిమాలు భారీ గా వస్తాయి కాబట్టి ఈ సినిమా కి 18 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట టాలీవుడ్ నిర్మాతలు. రజినీ లాస్ట్ మూవీ దర్బార్ 14.2 కోట్ల బిజినెస్ కి 10 కోట్ల రేంజ్ షేర్ నే వెనక్కి తీసుకు వచ్చింది. అంతకుముందు వచ్చిన పేట కూడా భారీ నష్టలనే మిగిలించింది…

అయినా కానీ రజినీ శివ ల కాంబినేషన్ లో వస్తున్న అన్నాతల్లె సినిమా కి 18 కోట్ల రేంజ్ ఆఫర్ కోట్ చేయడం విశేషం అనే చెప్పాలి. మరి ఈ ఆఫర్ ఫైనల్ అవుతుందా లేక వేరే పెద్ద ఆఫర్ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఫ్లాఫులు ఎన్ని ఎదురు అవుతున్నా కానీ ఈ రేంజ్ బిజినెస్ ఆఫర్స్ వస్తుండటం సూపర్ స్టార్ స్టార్ డం కి నిదర్శనం అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here