కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో సూపర్ స్టార్ రజినీ అందరి కన్నా ముందు నిలుస్తాడు… రజినీ సినిమా వస్తుంది అంటే బాక్స్ ఆఫీస్ కచ్చితంగా షేక్ అవ్వాల్సిందే, కానీ ఇదంతా కబాలి వరకు మాత్రమె… కబాలి సినిమా సొంతం చేసుకున్న ఊహకందని క్రేజ్ తర్వాత రజినీ నటించిన ఏ సినిమా కూడా సొంతం చేసుకోలేదు… దాంతో రజినీ సినిమాల బిజినెస్ లు….
తెలుగులో క్రమం తప్పకుండా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా రజినీ శివ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ పెద్దన్న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తెలుగు లో ఓవరాల్ బిజినెస్ 12 కోట్ల రేటు కి ఫిక్స్ అయ్యింది….
రీసెంట్ గా రజినీ నటించిన సినిమాల తెలుగు బిజినెస్ లను గమనిస్తే… కబాలి 31 కోట్ల బిజినెస్ ను అందుకుంటే తర్వాత వచ్చిన కాలా 33 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను తెలుగులో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక తర్వాత వచ్చిన రోబో 2.0 సినిమా శంకర్ రజినీ ల కాంబో అవ్వడంతో…
71 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇక తర్వాత చేసిన సినిమాల బిజినెస్ లు అన్నీ కూడా భారీగా తగ్గుతూ వచ్చాయి… పేట సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నే ఓవరాల్ గా సొంతం చేసుకోగా తర్వాత చేసిన దర్బార్ సినిమా 14.2 కోట్ల బిజినెస్ ను మాత్రమే తెలుగు లో సొంతం చేసుకుంది… ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న పెద్దన్న…
సినిమా 12 కోట్ల బిజినెస్ ను మాత్రమే సొంతం చేసుకుని రీసెంట్ టైం లో రజినీ మూవీస్ అన్నింటిలోకి లోవేస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, ఆంధ్రలో టికెట్ రేట్లు కూడా ఈ తక్కువ బిజినెస్ కి ఒక కారణం అవ్వగా ఓవరాల్ గా కెరీర్ లోనే రీసెంట్ టైం లో లోవేస్ట్ బిజినెస్ ని తెలుగు లో సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.