కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ హిట్ కొట్టి చాలా టైమే అవుతుంది. కబాలి డిసాస్టర్ టాక్ తో కూడా భీభత్సం సృష్టించినా కానీ ఆ సినిమా పై ఉన్న అంచనాలు తర్వాత రజినీ చేసిన ఏ సినిమా పై కూడా లేవనే చెప్పాలి. దాంతో రజినీ మార్కెట్ తెలుగు లో క్రమంగా పడిపోతూ వచ్చింది. తమిళ్ లో పేట, దర్బార్ లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించినా…
అవి రజినీ రేంజ్ అయితే కావనే చెప్పాలి… ఇలాంటి టైం లో విశ్వాసంతో బ్లాక్ బస్టర్ కొట్టిన శివ డైరెక్షన్ లో రజినీ చేస్తున్న కొత్త సినిమా అన్నట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమాను తెలుగు లో ఇప్పటి వరకు…
ఫస్ట్ లుక్ కాదు కదా టైటిల్ ని కూడా అనౌన్స్ చేయలేదు… కానీ తెలుగు లో బిజినెస్ ప్రపోజల్స్ ను రీసెంట్ గా మొదలు పెట్టగా ఆఫర్స్ 15 కోట్లకు పైగా రావాలని చెప్పారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంత రేటు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి ఉన్న నేపధ్యంలో…
సినిమా బిజినెస్ రేంజ్ ను కొంచం తగ్గించగా తెలుగు లో సినిమా రైట్స్ ని ఎట్టకేలకు అమ్మేశారు… సినిమా కి తెలుగు రైట్స్ కింద 12 కోట్ల రేటు సొంతం అయినట్లు తెలుస్తుంది, ఆ రేటు కూడా కొన్న బయ్యర్ల దగ్గర నాన్ రిఫండ్ అగ్రిమెంట్ కింద తీసుకున్నారట… ఇక సినిమా తెలుగు లో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అన్నది ఇంకా…
అఫీషియల్ గా చెప్పలేదు కానీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే టైం లో సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. 12 కోట్ల రేటు అంటే సినిమా ఇప్పుడు తెలుగు లో 12.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుంది… మరి ఇప్పుడున్న టైం లో ఈ సినిమా ఎంతవరకు ఈ బిజినెస్ ను రికవరీ చేస్తుందో చూడాలి.