బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం జైలర్ సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తర్వాత చేసిన వేట్టయన్ సినిమాతో అనుకున్న రేంజ్ లో అంచనాలను అయితే అందుకోలేక పోయాడు. ఇలాంటి టైంలో ప్రజెంట్ కోలివుడ్ హాట్ ఫేవరేట్ డైరెక్టర్ అయిన..
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీ హీరోగా చేస్తున్న కొత్త సినిమా కూలీ(Coolie Movie) మీద కోలివుడ్ తో పాటు సౌత్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీలక రోల్ చేస్తూ ఉండగా ఆల్ రెడీ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన….
ప్రమోషనల్ కంటెంట్ తోనే హైప్ మరో లెవల్ కి వెళ్ళిపోయింది. ఇక సినిమా ఆగస్టు 14న ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్స్ లో ఒకటైన వార్2(War2 Movie) తో పోటి పడబోతున్నా కూడా కొంచం ప్రస్తుతానికి హాట్ ఫేవరేట్ గానే నిలిచింది అని చెప్పాలి…
ఈ రేంజ్ హైప్ జస్ట్ ఒక కమర్షియల్ మూవీ కే కాగా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు…ఒక నార్మల్ కమర్షియల్ మూవీ కి ఈ రేంజ్ బడ్జెట్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 375 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టి భారీ ఎత్తున సినిమాను…
నిర్మించినట్లు తెలుస్తుంది. ఇందులో సగానికి పైగా డబ్బు రెమ్యునరేషన్ కిందే వెళ్లిందని అంటున్నారు…మెజారిటీ బడ్జెట్ రజినీ మరియు లోకేష్ ల రెమ్యునరేషన్ కి వెళ్ళగా మిగిలిన బడ్జెట్ తో సినిమాను భారీ ఎత్తున తీశారని సమాచారం…
సినిమా లోకేష్ LCU లో భాగం అవుతుందేమో అని అంచనాలు అందరిలోనూ ఉండగా…ఇది అందులో భాగం కాదంటూ చెబుతున్నారు ప్రస్తుతానికి. ఒకవేళ LCU లో భాగం అయితే మాత్రం అంచనాలు తారాస్థాయికి వెళ్ళడం ఖాయం… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.