సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ చూపించి చాలా కాలమే అవుతుంది, ముఖ్యంగా తెలుగు లో రజినీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి మరింత ఎక్కువ టైం అవుతుంది, రోబో తర్వాత రజినీ చేసిన సినిమాలు అన్నీ కూడా తెలుగు లో హిట్ గీత ని అందుకోలేదు, కబాలి అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా టాక్ దారుణంగా ఉండటం తో తేరుకోలేక పోయింది.
తర్వాత చేసిన సినిమాల మార్కెట్ భారీగా తగ్గగా రోబో 2.0 సినిమా ఒక్కటే మళ్ళీ భారీ కలెక్షన్స్ ని అందుకున్నా హిట్ కాలేదు.. ఇక గత రెండేళ్లుగా రజినీ చేసిన పేట మరియు దర్బార్ లు రెండూ సంక్రాంతి బరిలో దిగగా పోటి లో తెలుగు సినిమాలను తట్టుకోలేక…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ సినిమాలుగా నిలిచాయి. అయినా ఇప్పుడు రజినీ అప్ కమింగ్ మూవీ కి తెలుగు లో మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. షూటింగ్ పెండింగ్ ఉన్న ఈ సినిమా వచ్చే ఇయర్ మొదట్లో తిరిగి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతుండగా సినిమా ను…
సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు, తెలుగు లో కూడా రజినీ సినిమాలు భారీ గా వస్తాయి కాబట్టి ఈ సినిమా కి 15 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట టాలీవుడ్ నిర్మాతలు. రజినీ లాస్ట్ మూవీ దర్బార్ 14.2 కోట్ల బిజినెస్ కి 10 కోట్ల రేంజ్ షేర్ నే వెనక్కి తీసుకు వచ్చింది. అంతకుముందు వచ్చిన పేట కూడా భారీ నష్టలనే మిగిలించింది…
అయినా కానీ రజినీ శివ ల కాంబినేషన్ లో వస్తున్న అన్నాతల్లె సినిమా కి 15 కోట్ల రేంజ్ ఆఫర్ కోట్ చేయడం విశేషం అనే చెప్పాలి. మరి ఈ ఆఫర్ ఫైనల్ అవుతుందా లేక వేరే పెద్ద ఆఫర్ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది.