Home గాసిప్స్ RRR కి రజినీ సవాల్….2 సార్లు షాక్…3 వ సారి ఏమవుతుందో?

RRR కి రజినీ సవాల్….2 సార్లు షాక్…3 వ సారి ఏమవుతుందో?

1281
0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సెన్సేషనల్ క్రేజ్ ఉన్న తమిళ్ హీరో సూపర్ స్టార్ రజినీ… ఇండియా వైడ్ గా కూడా సాలిడ్ క్రేజ్ ఉన్న రజినీ రీసెంట్ టైం లో మరీ తన రేంజ్ కి తగ్గ విజయాల ను సొంతం చేసు కోకున్నా కానీ ఓపెనింగ్స్ పరంగా కానీ ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కానీ ఇప్పటి కీ తన రేంజ్ ఏంటో చూపుతూనే ఉన్నాడు అందరికీ..

లాస్ట్ 2 ఇయర్స్ గా రజినీ నటించిన సినిమాలు సోలో గా కాకుండా సంక్రాంతి రేసు లో నిలుస్తూ వస్తున్నాయి, పేట మరియు దర్బార్ సినిమాలతో రజినీ 2 సార్లు సంక్రాంతి కి రాగా తమిళ్ లో పర్వాలేదు అనిపించినా కానీ తెలుగు లో మాత్రం భారీ నిరాశే మిగిలింది అని చెప్పాలి.

ఇలాంటి టైం లో మళ్ళీ ఇప్పుడు మూడో సారి పోటి కి సిద్ధం అవుతున్నాడు రజినీ.. అది కూడా టోటల్ ఇండియా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రస్టీజియస్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ కి పోటి గా సంక్రాంతికి శివ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా ని రిలీజ్ చేయబోతున్నాడు.

ఈ విషయాన్ని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాంతో ఆర్ ఆర్ ఆర్ కి పోటి గా రజినీ సినిమా కన్ఫాం అయ్యింది… రెండు సార్లు ఇక్కడ రిజల్ట్ తేడా కొట్టడం తో ఈ సారి రిలీజ్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తిగా మారగా మరో పక్క.. లాక్ డౌన్ వలన షూటింగ్ ఆగిపోవడం తో…

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి కాకుండా సమ్మర్ రేసు లో నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. మరి ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అయినా వేరే తెలుగు సినిమా లు రేసులో ఎంటర్ అవ్వడం ఖాయం. అలా చూసుకున్నా రజినీ సినిమా కి ఈ సారి రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తి కరం అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here