Home న్యూస్ రాజ్ తరుణ్ “పురుషోత్తముడు” టాక్ ఏంటి…హిట్టా-ఫట్టా!!

రాజ్ తరుణ్ “పురుషోత్తముడు” టాక్ ఏంటి…హిట్టా-ఫట్టా!!

0
Raj tarun Purushothamudu Movie Review and Rating
Raj tarun Purushothamudu Movie Review and Rating

కెరీర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి హిట్స్ కొట్టి మంచి ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) తర్వాత మాత్రం వరుస పెట్టి ఫ్లాఫ్స్ తో తన గ్రాఫ్ ను పూర్తిగా కోల్పోయి సినిమా సినిమాకి తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయి కనీసం తన సినిమాలను నోటిస్ కూడా చేయలేని పరిస్థితి ని తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాజ్ తరుణ్ నటించిన కొత్త సినిమా  పురుషోత్తముడు(Purushothamudu Movie Review)మూవీ…

ఈ శుక్రవారం రిలీజ్ అయినట్లు కూడా చాలా తక్కువ మందికే తెలుసు….ఇక సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మినీ శ్రీమంతుడు మూవీలా ఉంది అనిపించిన పురుషోత్తముడు మూవీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఒక్క శ్రీమంతుడే కాదు ఇతర సినిమాలను కూడా గుర్తు చేసింది అని చెప్పాలి. మొత్తం మీద పురుషోత్తముడు కథ పాయింట్ కి వస్తే….

విదేశాల్లో చదువుకుని ఇండియాకి వచ్చిన హీరోకి తన కంపెనీ భాద్యతలు అప్పగించాలి అనుకుంటాడు హీరో తండ్రి, కానీ అది జరగాలి అంటే హీరో ఒక 100 రోజులు అజ్ఞాతంలో ఉండాలని రమ్యకృష్ణ కండీషన్ పెడుతుంది. ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… మొత్తం మీద కోర్ కథ పాయింట్ లో కొంచం మ్యాటర్ ఉన్నప్పటికీ డైరెక్టర్ కథని…

ఏమాత్రం అనుకున్న రేంజ్ లో తీర్చిదిద్దలేకపోయాడు…రాజ్ తరుణ్ అంత పవర్ ఫుల్ రోల్ లో సెట్ అవ్వలేదు అనిపించింది… కొన్ని సీన్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా చూస్తున్న ఆడియన్స్ కి ఆ సీన్స్ ఏమి కనెక్ట్ అయ్యేలా లేవు…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లో గా ఉండగా ఫస్టాఫ్ కే కొంచం నీరసం వచ్చేయగా ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్వాలేదు అనిపించగా…

సెకెండ్ ఆఫ్ కి వచ్చేసరికి సినిమా మరింత డ్రాగ్ అయ్యి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురుచూసేలా చేస్తుంది. రాజ్ తరుణ్ కొంచం పర్వాలేదు అనిపించినా ముందే చెప్పినట్లు ఈ కథకి తను సెట్ అవ్వలేదు అనిపించింది. మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించగా ఓవరాల్ గా మూవీ మినీ శ్రీమంతుడులానే అనిపించినా ఎమోషన్స్, ఆడియన్స్ కనెక్షన్ ఆ సినిమాతో….

పోల్చితే పురుషోత్తముడు సగంలో సగం కూడా మ్యాచ్ చేయలేక పోయింది….దాంతో చూస్తున్న ఆడియన్స్ సహనానికి పరీక్షగా అనిపించిన పురుషోత్తముడు మూవీని చూడాలి అంటే ఆడియన్స్ కి చాలా చాలా ఓపిక అవసరం అని చెప్పాలి. అంత ఓపిక పట్టి చూస్తె ఓవరాల్ గా యావరేజ్ లెవల్ లో ఉంటుంది కానీ చాలా ఓపిక అవసరం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here