Home న్యూస్ ఇది రాజ్ తరుణ్ శ్రీమంతుడు…క్లిక్ అయితే కంబ్యాక్ పక్కా!

ఇది రాజ్ తరుణ్ శ్రీమంతుడు…క్లిక్ అయితే కంబ్యాక్ పక్కా!

0

చాలా టైంగా టాలీవుడ్ లో హిట్ కి దూరం అయిన హీరోలలో యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) ఒకరు…కెరీర్ మొదట్లో హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన ఈ హీరో తర్వాత సరైన సినిమాలను ఎంచుకునే విషయంలో పూర్తిగా వెనకబడి తొలి సినిమాలతో వచ్చిన తన మార్కెట్ మొత్తాన్ని కోల్పోయాడు…

తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాజ్ తరుణ్ కి లక్ అయితే కలిసి రాలేదు…ఇలాంటి టైంలో రీసెంట్ గా భలే ఉన్నాడే సినిమా టీసర్ తో మెప్పించగా ఇప్పుడు తన మరో కొత్త సినిమా టీసర్ కూడా చాలా బాగా మెప్పించి ప్రామిసింగ్ మూవీ లా అనిపిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి…

ఆ సినిమానే పురుషోత్తముడు(Purushothamudu Movie)….భారీ స్టార్ కాస్ట్ తో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో మంచి క్వాలిటీతో తెరకెక్కిన ఈ సినిమా టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఒక ఊరికి వెళ్ళిన హీరో ఆ ఊరి సమస్యలను తీరుస్తూ ఉంటాడు…కానీ తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది…

ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా కథ పాయింట్ గా పురుషోత్తముడు టీసర్ చూస్తుంటే అనిపిస్తుంది, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఇలా మంచి స్టార్ కాస్ట్ తో రానున్న ఈ సినిమా టీసర్ వరకు చూస్తుంటే ప్రామిసింగ్ లానే అనిపిస్తూ ఉండగా ఎక్కువ శాతం మాత్రం కథ పాయింట్ మహేష్ బాబు(Mahesh Babu)…

శ్రీమంతుడు మూవీని పోలినట్లు అనిపిస్తూ ఉంది…మరీ కథని అలానే తీసుకుని ఉండరు కానీ ఎదో ఒక కొత్త ఎలిమెంట్ ని ఇందులో పెట్టి ఉంటారని అనిపిస్తుంది. అదే నిజం అయ్యి సినిమా పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో ఉంటే కనుక రాజ్ తరుణ్ కి మంచి కంబ్యాక్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here