Home న్యూస్ 40 కోట్ల బడ్జెట్ అనుకుంటే….టోటల్ లెక్కే మారిపోయింది…..సీక్వెల్ కోసం ఊహకందని బడ్జెట్!

40 కోట్ల బడ్జెట్ అనుకుంటే….టోటల్ లెక్కే మారిపోయింది…..సీక్వెల్ కోసం ఊహకందని బడ్జెట్!

1779
0

రెండేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చిన సినిమా రాక్షడుడు… బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో మొట్ట మొదటి క్లీన్ హిట్ మూవీ గా నిలిచిన ఈ సినిమా తమిళ్ లో వచ్చిన రాక్షసన్ సినిమా తెలుగు రీమేక్ గా వచ్చినా తెలుగులో సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుని ఒరిజినల్ ని ఏమాత్రం చెడగొట్టకుండా మెప్పించింది, ఇక ఈ సినిమా కి డైరెక్షన్ చేసిన రమేష్ వర్మ…

సినిమా రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ రెండేళ్ళ కి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. ఈ సారి బెల్లంకొండ ప్లేస్ లో ఓ టాప్ హీరో ఇందులో నటిస్తారు అంటూ చెప్పగా సినిమా టైటిల్ పోస్టర్ ను అనౌన్స్ చేసి సినిమా పై హైప్ పెంచారు.

ఇక తర్వాత సినిమా కేవలం తెలుగు వరకు మాత్రమే… తెరకెక్కుతుంది అనుకుంటే తెలుగు తమిళ్ అంటూ వార్తలు రాగా బడ్జెట్ కూడా 40 కోట్ల రేంజ్ లో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా సినిమా అనౌన్స్ మెంట్ మరోసారి జరగగా ఈ సారి అందరికీ శాకిస్తూ సినిమా తెలుగు తమిళ్ లోనే కాదని…

ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందబోతున్న సినిమా అంటూ కన్ఫాం చేశారు మేకర్స్… దాంతో పాటు సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెంచేసి ఇప్పుడు ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను భారీ లెవల్ లో తెరకెక్కించ బోతున్నారని సమాచారం. సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం కూడా లండన్ లోనే జరగబోతుంది అంటూ కన్ఫాం చేశారు ఇప్పుడు.

ఎదో బైలింగువల్ గా సినిమాను తీస్తారు అనుకుంటే ఏకంగా ఇప్పుడు సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందబోతున్న సినిమాగా మారనుంది. ఇక ఈ సినిమా నటించే టాప్ స్టార్ ఎవరు అనేది అతి త్వరలోనే తెలియజేస్తారు అంటున్నారు. మరి రాక్షసుడు రేంజ్ లో సీక్వెల్ కూడా ఉంటే పాన్ ఇండియా లెవల్ లో అదరగొట్టే అవకాశం ఎంతైనా ఉంటుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here