Home న్యూస్ రాక్షసుడు రివ్యూ-రేటింగ్…5 ఏళ్ల నిరీక్షణ కి తెర!!

రాక్షసుడు రివ్యూ-రేటింగ్…5 ఏళ్ల నిరీక్షణ కి తెర!!

2165
0

         రాక్షసుడు, తమిళనాడు లో రాక్షసన్ పేరుతొ తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి నోచుకోక అనేక సార్లు పోస్ట్ పోన్ అయినా రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, అలాంటి సినిమా పై టాలీవుడ్ స్టార్ హీరోల కళ్ళు పడ్డప్పటికీ చివరికి 5 ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ కి సిద్ధం అయ్యాడు, ఆ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Rakshasudu Movie Total Theaters Count WW
Rakshasudu Movie Total Theaters Count WW

ముందుగా ఓవర్సీస్ లో ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా రెగ్యులర్ షోలకి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది, సినిమా అంచనాలను అందుకుందా లేదా, ఒరిజినల్ ని మరిపించిందా లేదా తెలుసుకుందాం పదండి.

ముందుగా కథ విషయానికి వస్తే డైరెక్టర్ అవ్వాలని హర్రర్ మిస్టరీ సినిమా తీయాలని కష్టపడే హీరో కి అవకాశం దొరకదు, ఫ్యామిలీ అవసరాల కోసం పోలిస్ అవ్వాల్సి వస్తుంది, అక్కడే ఒక కేస్ తాను తీయాలి అనుకున్న సినిమా లో సైకో పాత్రలను తలపిస్తూ అమ్మాయలని దారుణంగా హత్య చేస్తూ ఉంటాడు.

ఆ విలన్ ని హీరో ఎలా పట్టుకున్నాడు, విలన్ అలా అమ్మాయలని చంపడానికి కారణం ఏంటి అనేది సెకెండ్ ఆఫ్ లో రివీల్ చేస్తారు. సినిమా లెంత్ 2 గంటల 30 నిమిషాల లోపు ఉంటే అందులో విలన్ ఎవరూ అని తెలుసుకోవడానికి సెకెండ్ ఆఫ్ సగం అయ్యే వరకు ఎదురు చూడాల్సి వస్తుంది.

కానీ ఏ సీన్ కూడా బోర్ కొట్టదు, తర్వాత సీన్ ఏం అవుతుంది, అసలు విలన్ ఎవరు అన్న ఆసక్తి ఆద్యంతం కొనసాగగా హీరో విలన్ ని పట్టుకునే సీన్ లో విలన్ ఫ్లాష్ బ్యాక్ తెలిసిపోయినా సరే క్లైమాక్స్ వరకు సినిమా టైట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని చూపు తిప్పుకోనివ్వదు.

ఇలాంటి కథ లో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా ఒరిజినల్ లో చేసిన హీరో కి ఏమాత్రం తగ్గకుండా నటనతో యాక్షన్ సీన్స్ తో దుమ్ము లేపాడు, హీరోయిన్ అనుపమ రోల్ కి తగ్గట్లు ఆకట్టుకోగా చిన్నపాప రోల్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

ఇక సినిమా కి మేజర్ ప్లస్ పాయింట్ గిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రతి చిన్న సీన్ ని కూడా తన బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ హాలివుడ్ లెవల్ లో ఎలివేట్ అయ్యేలా సంగీతం అందించాడు గిబ్రాన్, ఒరిజినల్ లో ఉన్న ట్యూన్స్ ని మార్చితే ఎక్కడ తేడా కొడుతుందో అన్న డౌట్ లో అవే ట్యూన్స్ ని వాడి సినిమా ఫీల్ ని అలాగే మెయిన్ టైన్ చేశారు.

ఇక స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు, ఒకటి రెండు పాటలు తప్పితే సినిమా మొత్తం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూనే ఉంటుంది, ఇక డైరెక్షన్ విషానికి వస్తే రమేష్ వర్మ, ఒరిజినల్ లో ఉన్న చాలా సీన్స్ ని అలాగే వాడేశాడు, కొన్ని సీన్స్ ని తెలుగు ఆడియన్స్ కి తగ్గట్లు మార్చారు. ఓవరాల్ గా డైరెక్షన్ బాగానే ఉంది…

ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కాగా, సినిమా జానర్ సస్పెన్స్ అవ్వడంతో సినిమా మొత్తం చాలా వరకు సీరియస్ నోట్ తో సాగుతుంది, అలాగే ఈ హత్యలు సైకో సీన్స్ ఫ్యామిలీస్ కి కొంచం ఇబ్బంది పెట్టె చాన్స్ ఉంది. ఇవి మొత్తం మీద అతి చిన్న మైనస్ పాయింట్స్…

ఓవరాల్ గా ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్ళు కూడా తెలుగు వర్షన్ విషయం లో ఇంప్రెస్ అవుతారు, ఇక ఒరిజినల్ చూడని వారు అయితే తెలుగు వర్షన్ చూసి మెస్మరైజ్ అవుతారు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3.25 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here