Home గాసిప్స్ రామ్ చరణ్-అల్లు అర్జున్ అనుకుంటే…విజయ్ దేవరకొండ వచ్చాడు!

రామ్ చరణ్-అల్లు అర్జున్ అనుకుంటే…విజయ్ దేవరకొండ వచ్చాడు!

928
0

ఒకరి కోసం అనుకున్న రోల్ ని మరొకరు చేయడం అన్నది సర్వ సాధారనంగా జరిగేదే. ముందు ఒకరిని ఆ పాత్ర లో ఊహించుకోవడం తర్వాత ఆ పాత్ర తనకి సెట్ అవ్వదు అనుకుని కొందరు, టైం కుదరక కొందరు ఆ పాత్ర నుండి తప్పుకోవడం తో వేరే వాళ్ళు ఆ పాత్ర కి ఓకే చెప్పడం జరుగుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు రాబోతున్న అప్ కమింగ్ క్రేజీ మూవీ విషయం లో ఇదే జరుగుతుంది అంటున్నారు.

వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా ఈ ఏడాది ఇక వచ్చేలా లేదనే చెప్పాలి. కాగా ఈ సినిమాను వెంటనే పూర్తీ చేసి మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్ ని మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు కానీ…

అది ప్రస్తుత పరిస్థితుల వల్ల మరికొంత కాలం పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. కాగా ఈ సినిమా ఒరిజినల్ లో మోహన్ లాల్ తో పాటు ఒక కీలక రోల్ లో అక్కడ ప్రుద్వీరాజ్ నటించాగా తెలుగు లో ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తిగా మారగా…

ఎలాగూ రామ్ చరణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు కాబట్టి మరోసారి మెగాస్టార్ మూవీ లో స్పెషల్ రోల్ చేస్తారు అన్న వార్తలు రాగా తర్వాత రామ్ చరణ్ ప్లేస్ లో అల్లు అర్జున్ ఆ రోల్ లో నటించే అవకాశం ఉందని వార్తలు కూడా శిఖారు చేయగా ఇప్పుడు ఇద్దరూ కాకుండా యూత్ సెన్సేషన్ అయిన…

విజయ్ దేవరకొండ ఆ రోల్ చేయబోతున్నారు అంటూ వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. తనకి రోల్ కూడా బాగా సూట్ అయ్యేదే అని అంటున్నారు కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇయర్ ఎండ్ లో మొదలు కావచ్చని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here