Home న్యూస్ చస్ మరో రికార్డ్ అవుట్….చరిత్రలో ఇదే ఫస్ట్ టైం!!

చస్ మరో రికార్డ్ అవుట్….చరిత్రలో ఇదే ఫస్ట్ టైం!!

1459
0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరిట మరో అరుదైన రికార్డ్ వచ్చి పడింది, ఎన్టీఆర్ తో కలిసి జక్కన్న డైరెక్షన్ లో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో భాగంగా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన భీమ్ ఫర్ రామరాజు ఇంట్రో టీసర్ అల్టిమేట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, లైక్స్ పరంగా తొలి రోజు రికార్డ్ అందుకున్న ఈ టీసర్ తర్వాత…

స్లో డౌన్ అయింది, కానీ మళ్ళీ ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రామరాజు ఫర్ భీమ్ రిలీజ్ అయినప్పటి నుండి ఆ కొత్త టీసర్ పాటు ఈ 7 నెలల క్రితం రిలీజ్ అయిన టీసర్ కూడా సాలిడ్ గా వ్యూస్ ని సొంతం చేసుకుని సత్తా చాటడం విశేషం అనే చెప్పాలి.

8 లక్షల లైక్స్ మార్క్ ని కూడా అందుకున్న ఈ టీసర్ వ్యూస్ సాలిడ్ గా పెరుగుతూ ఏకంగా టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. తర్వాత కూడా జోరు తగ్గకుండా ఇప్పుడు టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి…..

35 మిలియన్ మార్క్ ని అందుకున్న తొలి టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసి ఊరమాస్ రికార్డ్ ను సొంతం చేసుకుంది, ఇక రామ్ చరణ్ ఖాతాలో మరో రికార్డ్ కూడా చేరింది, టాలీవుడ్ లో ట్రైలర్ అండ్ టీసర్ రెండింటి పరంగా 35 మిలియన్ మార్క్ ని అందుకున్న హీరోగా అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేశాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ ట్రైలర్ 35 మిలియన్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన ఇంట్రో టీసర్ ఈ మార్క్ ని అందుకోగా ట్రైలర్ అండ్ టీసర్ రెండింటిలో ఈ రికార్డ్ కొట్టిన మొట్ట మొదటి టాలీవుడ్ హీరోగా సంచలన రికార్డ్ ను అందుకున్నాడు రామ్ చరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here