టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయ విదేయ రామ రిలీజ్ అయిన తర్వాత పూర్తీ టైం ని ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించగా ఆల్ మోస్ట్ ఏడాదిన్నర కి పైగానే టైం అవుతుంది, మరో 6 నెలల టైం మినిమమ్ ఆర్ ఆర్ ఆర్ కోసం కేటాయించక తప్పని పరిస్థితి… ఇలాంటి టైం లో తన అప్ కమింగ్ మూవీస్ ప్లానింగ్ విషయం లో కొంచం స్లో అయ్యాడు రామ్ చరణ్…
మిగిలిన హీరోలు అందరూ కూడా లాక్ డౌన్ టైం లో చాలా వరకు అప్ కమింగ్ మూవీస్ విషయం లో పక్కా సెలెక్షన్స్ ని కంప్లీట్ చేసుకున్నారు, ఆర్ ఆర్ ఆర్ విషయానికే వస్తే ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా ఆర్ ఆర్ ఆర్ టైం కే షెడ్యూల్ అయ్యాయి.
ఇక రామ్ చరణ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎలాంటి మూవీ చేస్తాడు, అది పాన్ ఇండియా మూవీ నా లేక నార్మల్ తెలుగు మూవీనా అన్న డౌట్ ఉండగా మరో పక్క రేసులో చాలా వరకు టాలీవుడ్ డైరెక్టర్ల పేర్లు వినిపించినా ఎవ్వరూ ఫైనల్ కానీ టైం లో ఎవ్వరూ…
ఎక్స్ పెర్ట్ చేయని విధంగా 2016 లో రామ్ చరణ్ చేసిన ధృవ సినిమా ఒరిజినల్ వర్షన్ తనీ ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో సినిమా కమిట్ అయ్యాడు అని వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి, తెలుగు తమిళ్ బైలింగువల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. రీసెంట్ టైం లో డైరెక్టర్ పెద్దగా ఫాం లో లేకున్నా కానీ…
రామ్ చరణ్ తో సినిమా అనే సరికి ఇప్పుడు అందరూ వీళ్ళ కాంబినేషన్ పై అంచనాలు పెంచుకుంటున్నారు. మరి వీళ్ళ కాంబినేషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా లేదా అన్నది త్వరలో తెలియనుంది… ఎవరెవరో అనుకుంటే మాత్రం రామ్ చరణ్ కొత్త సినిమా కాంబినేషన్ భారీ షాక్ నే ఇవ్వబోతుంది అని చెప్పాలి.