రెండు మూడు రోజుల ముందు వరకు కూడా పెద్దగా లీకులు లేని ఒక న్యూస్ ఒక్కసారిగా సోషల్ మీడియా లో వైరల్ అయింది, కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎక్కడో చిన్న డౌట్, కానీ వాటినన్నింటినీ పటాపంచలు చేస్తూ బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ రీసెంట్ గా రానే వచ్చింది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్టులో ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఏమాత్రం తగ్గని మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.
అసలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఆల్ ఇండియా లో బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సినిమా ను అఫీషియల్ గా కన్ఫాం చేశారు. శంకర్ మొట్ట మొదటి సారిగా ఒక టాలీవుడ్ మూవీ చేస్తుండటం విశేషం. ఇక శంకర్ రామ్ చరణ్ ల ఈ సెన్సేషనల్ మూవీ ని…
టాలీవుడ్ లీడింగ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మించబోతున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ప్రతిష్టాత్మక 50 వ సినిమాగా నిర్మాణం కాబోతుందని అఫీషియల్ పోస్టర్ లో అప్ డేట్ చేశారు. ఈ రేంజ్ లో ఫ్యాన్స్ కి సడెన్ సర్ప్రైజ్ లు ఇచ్చిన ఈ కాంబినేషన్…
ఇప్పుడు ఇండియా లో రూపొందే అప్ కమింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటిగా మారింది, దిల్ రాజు శంకర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా గా చెప్పుకుంటున్నారు. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా పనుల్లో ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన ఆ సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చింది.
కానీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ తో సినిమాను పూర్తీ చేస్తారని తెలుస్తుంది, ఈ గ్యాప్ లో రామ్ చరణ్ ఇటు ఆర్ ఆర్ ఆర్ లో బాలెన్స్ షూటింగ్ ను అటు ఆచార్యలో తన స్పెషల్ క్యామియో ని ఫినిష్ చేస్తారు. ఇక తర్వాత వీళ్ళ కాంబోలో పాన్ ఇండియా మూవీ రచ్చ చేయడానికి సిద్ధం కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా భీభత్సాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది..