Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ టోటల్ బిజినెస్…రామ్ ఊరమాస్!

ఇస్మార్ట్ శంకర్ టోటల్ బిజినెస్…రామ్ ఊరమాస్!

893
0

     యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన సినిమాలలో మాస్ మూవీస్ ఉన్నప్పటికీ అందులో “మస్కా” కి వచ్చినంత క్రేజ్ మరే సినిమా కి రాలేదు. ఆ సినిమా రిజల్ట్ ని అప్పట్లో అరుంధతి దెబ్బ కొట్టగా రామ్ తర్వాత మూవీస్ కి మళ్ళీ అలాంటి క్రేజ్ దక్కలేదు. మళ్ళీ ఇప్పుడు రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి క్రేజ్ పీక్స్ కి వెళ్ళే రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.

18 న రిలీజ్ కాబోతున్న ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి బజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ని మాస్ సెంటర్స్ లో సినిమా కి అల్టిమేట్ క్రేజ్ దక్కుతుందని సమాచారం.

ఇక బిజినెస్ పరంగా కూడా సినిమా దుమ్ము లేపే బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఒకసారి గమనిస్తే…
Nizam: 7.20cr
Andhra: 6.50cr
ceeded: 3.33cr
Ap-TG: 17.03Cr
Karnataka: 1.50cr
ROI: 65L
OS: 1.1Cr
Total = 20.28cr

కానీ ఇందులో కొన్ని ఏరియాల్లో సినిమా ను ఓన్ గా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో ఆ ఓన్ రిలీజ్ ని పక్కకు పెడితే ఓవరాల్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ సుమారు 17.8 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…

మినిమం లో మినిమమ్ 18.8 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించాల్సి ఉంటుంది, టెంపర్ తర్వాత హిట్ లేని పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రామ్ సరికొత్త క్యారెక్టర్ వలన మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ రేంజ్ లో కూడా మాస్ ని చూపెట్టాల్సి ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here