ఎనర్జిటిక్ స్టార్ రామ్ లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ తో దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకున్నాడు, తర్వాత తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడం సినిమాను తెలుగు లో రెడ్ పేరుతో రీమేక్ చేయగా సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా క్లారిటీ లేదు, ముందు డైరెక్ట్ రిలీజ్ అనుకున్నా ఆ ఆప్షన్ ను వద్దని రామ్ చెప్పగా థియేటర్స్ లో బెటర్ డేట్ చూసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు టీం.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా రామ్ అప్ కమింగ్ మూవీ పై ఇంకా క్లారిటీ లేకుండా పోయింది, లాక్ డౌన్ టైం లో చాలా కథలను విన్న రామ్ ఒక్క కథను కూడా ఓకే చేయలేదు, రీసెంట్ గా సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ లు కథలు చెప్పగా…
హిందీ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హే జవానీ హై దివానీ సినిమా రీమేక్ ఆఫర్ కూడా వచ్చినప్పటికీ నో చెప్పాడు రామ్. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం మూడేళ్ళ క్రితం వద్దు అనుకున్న కథని ఇప్పుడు రామ్ చేయబోతున్నాడు అని టాక్ వస్తుంది.
మూడేళ్ళ క్రితం వచ్చిన గరుడ వేగ సినిమాను తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ తో చేసిన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రామ్ మూవీ ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది, కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. బడ్జెట్ ప్రాబ్లమ్స్ వలన అలా జరిగి ఉండొచ్చు అన్న వార్తలు అప్పట్లో రాగా..
ఇప్పుడు ప్రవీణ్ సత్తారు నాగార్జున తో సినిమా చేయాల్సి ఉన్నా మరికొంత టైం పడుతుంది, ఈ గ్యాప్ లో ఆ కథ గురించి రామ్ మరోసారి కనుక్కోగా రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు మార్పులు చేర్పులు చేసిన కథని రామ్ కి వినిపించారని అంటున్నారు. ఇక రామ్ 3 ఏళ్ల క్రితం లా నో చెబుతారా లేక ఎస్ చెబుతారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది..