Home న్యూస్ రామ్ రెడ్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

రామ్ రెడ్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

1930
0

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు ఇప్పుడు సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎంత వరకు ఆకట్టుకుంది, ఒరిజినల్ వర్షన్ ని మరిపించిందా లేదా తెలుసు కుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే…ఒకేలా ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకే ఊరిలో ఉంటారు, ఒకరు క్లాస్ మరొకరు మాస్… సడెన్ గా ఒక వ్యక్తీ మర్డర్ జరుగుతుంది. కానీ ఈ ఇద్దరిలో ఎవరు చేశారో తెలియదు… మరి పోలీసులు ఈ ఇద్దరిలో ఎవరు ఆ మర్డర్ చేశారో కనిపెట్టారా లేదా..

అసలు మర్డర్ ఎందుకు జరిగింది లాంటి విశేషాలు అన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా రామ్ రెండు డిఫెరెంట్ రోల్స్ లో అద్బుతంగా నటించాడు. తన రోల్స్ కి ఫుల్ న్యాయం చేసి మెప్పించాడు. ఒకటి క్లాస్ ఒకటి మాస్ రోల్ కాగా మాస్ రోల్ కొంచం…

ఇస్మార్ట్ శంకర్ కి కొనసాగింపుగా అనిపిస్తుంది… రెండు రోల్స్ కూడా బాగా మెప్పించాయి. ఇక హీరోయిన్స్ లో మాళవిక మరియు అమృత అయ్యర్ లు జస్ట్ ఓకే అనిపించుకోగా నివేదా పెతురాజ్ రోల్ కొంచం బాగుంది….. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నుండి అసలు సమస్య మొదలు అయింది. ఒరిజినల్ వర్షన్ ఎంత రేసీ స్క్రీన్ ప్లే తో మెప్పిస్తే ఇక్కడ అంత స్లో నరేషన్ తో రన్ అవ్వడం ఇబ్బంది పెట్టింది…

ఒరిజినల్ చూసిన వాళ్ళకి మరింత ఇబ్బంది పెట్టిన ఈ అంశం సినిమా రిజల్ట్ పై ఇంపాక్ట్ చూపింది. ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే మెప్పించగా కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా మెప్పించింది.

ఇక డైరెక్షన్ పరంగా కిషోర్ తిరుమల ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తీ డిఫెరెంట్ కాన్సెప్ట్ అయిన రెడ్ మూవీ తనను బలవంతంగా ఈ ప్రాజెక్ట్ చేయించారా అనిపించే విధంగా ఇంప్రెస్ చేయలేక పోయాడు. అద్బుతమైన కథ ఉండి ఫాం లో ఉన్న హీరో ఉన్నా కూడా…

సరిగ్గా వాడుకోలేక నీరసమైన డైరెక్షన్ తో సినిమా డ్రాగ్ చేశాడు. ఫస్టాఫ్ లో మాళవిక లవ్ స్టొరీ నుండే తన మార్క్ మిస్ అయింది. ఫోర్స్ గా అనిపించిన ఆ సీన్స్ తర్వాత ఎలాగోలా ఇంటర్వెల్ బ్లాంక్ మెప్పించినా సెకెండ్ ఆఫ్ కంప్లీట్ గా…

వీక్ స్క్రీన్ ప్లే అండ్ డ్రాగ్ అయిన సీన్స్ తో సినిమా నిరుత్సాహ పరించింది, క్లైమాక్స్ మళ్ళీ ట్విస్ట్ తో మెప్పించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. రామ్ పడ్డ కష్టం వృదా అయ్యింది. ఓవరాల్ గా సినిమా అక్కడక్కడా మెరుపులు మెరిపించినా కానీ మొత్తం మీద మాత్రం…

ఒరిజినల్ తో పోల్చితే అంచనాలను అందుకోలేదు, అండ్ ఒరిజినల్ చూసిన వాళ్ళకే కాకుండా చూడని వాళ్లకి కూడా సినిమా స్లోగా డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది. ఫైనల్ గా సినిమా రామ్ ఫ్యాన్స్ కి కొంచం బాగుంది అనిపించినా కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె…

యావరేజ్ స్టఫ్ ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. పండగ సెలవుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్… కొంచం కష్టంగా ఉన్నా ఒకసారి చూసే విధంగా సినిమా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here