పరిస్థితులు సద్దుకునేలా కనిపించడం లేదు… మరో రెండు మూడు నెలల పాటు అయితే ఎలాంటి మార్పులు ఉండే అవకాశం కూడా లేదని తెలుస్తుంది. థియేటర్స్ మూసేసి ఇప్పటికే 4 నెలల టైం అవుతుంది. మరో రెండు మూడు నెలల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరో పక్క ఇతర ఇండస్ట్రీల క్రేజీ సినిమాలు ఆల్ రెడీ డిజిటల్ రిలీజ్ కి సై అంటూ వరుస సినిమా లను అనౌన్స్ చేస్తున్నాయి.
ఇలాంటి టైం లో టాలీవుడ్ లో మాత్రం సమ్మర్ రేసులో ఉన్న సినిమాలకు డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ ఇస్తూనే ఉన్నా కానీ ఏవి ముందుకు రావడం లేదు. అందులో ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ మూవీ కి ఆఫర్స్ వెల్లువగా వస్తున్నా కానీ…
ఎం చెప్పడం లేదని తెలుస్తుంది. ముందు 23 కోట్ల తో మొదలైన ఆఫర్ యూనిట్ నో చెప్పడంతో కొంత కాలం ఆగి మళ్ళీ ఏకంగా 28 కోట్లకు పెరిగింది. కానీ దానికి కూడా మేకర్స్ నో అనే చెప్పారు. రామ్ లాస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బిజినెస్ 18.5 కోట్లు కాగా దానికన్నా ఇది…
ఆల్ మోస్ట్ 10 కోట్లు ఎక్కువ బిజినెస్ ఆఫర్… ఇక దానికి నో చెప్పడంతో మరికొంత కాలం ఆగి ఫైనల్ గా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు రేటు ని మరింత పెంచి 30 కోట్లకు సినిమా డిజిటల్ రైట్స్ హక్కులు మాకు అమ్మండి అంటూ ప్రపోజల్ పెట్టారట. అంటే ఇస్మార్ట్ శంకర్ కన్నా 12 కోట్లు అధికమైన బిజినెస్ ఇది.
అయినా కానీ యూనిట్ మొదటి ఛాయిస్ థియేట్రికల్ రిలీజ్ కే అంటూ చెబుతున్నారట. దాంతో మరొకొన్ని రోజులు ఎదురు చూద్దాం అనుకుంటూ ఊరుకుంటున్నారట యాప్ వాళ్ళు. థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ ఆగడం బెటరే… కానీ పరిస్థితి ఇయర్ ఎండ్ కి కూడా సద్దుకోక పొతే ఈ ఆఫర్స్ కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఫైనల్ గా ఎం జరుగుతుందో చూడాలి…