Home గాసిప్స్ వరుస ఫ్లాఫ్స్ ఎఫెక్ట్….నిర్మాతలను సేఫ్ చెయ్యడానికి రామ్ కొత్త నిర్ణయం!!

వరుస ఫ్లాఫ్స్ ఎఫెక్ట్….నిర్మాతలను సేఫ్ చెయ్యడానికి రామ్ కొత్త నిర్ణయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో హిట్స్ కి దూరం అయిన హీరోలలో ఒకరైన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) చేసిన ది వారియర్, స్కంద మరియు డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు భారీ ఫ్లాఫ్స్ గా నిలవగా వాటి తర్వాత ఇప్పుడు రామ్ పోతినేని ఎట్టి పరిస్థితులలో కూడా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం…

ఎంతైనా ఉండగా మాస్ రూట్ మానేసి ఈ సారి కొంచం క్లాస్ అండ్ కమర్షియల్ టచ్ తో రామ్ చేస్తున్న కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలుకా(Andhra King Taluka Movie) సినిమా రీసెంట్ గా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోతో పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలు సినిమా మీద పెరిగాయి…

రామ్ కందిరీగ సినిమా టైం లుక్ తో అదరగొట్టగా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటూ ఉండగా ఈ సినిమా కన్నా ముందు వరకు రెమ్యునరేషన్ పరంగా భారీ లెవల్ లో రేటుని తీసుకున్న రామ్..

ఆ సినిమాల రిజల్ట్ తర్వాత నిర్మాతలకు అదనపు భారం తాను అవ్వకూడదు అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఆంధ్ర కింగ్ తాలుకా కన్నా ముందు చేసిన సినిమాలకు ఆల్ మోస్ట్ 14-16 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ ఉండగా…

ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలుకా సినిమాకి మాత్రం రెమ్యునరేషన్ ని తగ్గించి 10 కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేషన్ తీసుకుంటూ దాంతో పాటు సినిమా ప్రాఫిట్ షేర్ లో కొంత భాగం తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది… సినిమా రిలీజ్ తర్వాత హిట్ అయ్యి మేకర్స్ కి…

మంచి ప్రాఫిట్స్ వస్తే అందులో కొంత షేర్ మాత్రమే రామ్ కి వెళుతుంది. లేదంటే 10 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునేలా ఒప్పుకున్నాడట…ఓవరాల్ గా ఈ నిర్ణయంతో నిర్మాతకి బడ్జెట్ పరంగా పెద్దగా ఇబ్బంది లేదని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో రామ్ సాలిడ్ కంబ్యాక్ ను ఏ రేంజ్ లో సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here