బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని కి మాస్ లో మంచి క్రేజ్ ను ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసుకు రాగా తర్వాత చేసిన రెడ్ ది మూవీ కూడా మంచి రిజల్ట్ నే సొంతం చేసుకుంది, దాంతో ఇప్పుడు ది వారియర్ అంటూ మరో పక్కా మాస్ కమర్షియల్ మూవీ తో రామ్ ఆడియన్స్ ముందుకు వచ్చినా సినిమా కి బుకింగ్స్ మూడు రోజుల ముందే స్టార్ట్ అయినా కానీ అసలు బుకింగ్స్…
ఏమాత్రం ఆశించిన విధంగా అయితే జరగలేదు. టికెట్ హైక్స్ మరియు వర్షాల ఇంపాక్ట్ వలన ఇలా జరిగినప్పటికీ సినిమా భారీ బిజినెస్ ను సాధించడంతో గట్టి ఓపెనింగ్స్ ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడగా బుకింగ్స్ నిరాశ పరచడంతో ఇక సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అన్నది…
కొంచం టెన్షన్ ని క్రియేట్ చేసినా కానీ సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో సినిమాకి చాలా సెంటర్స్ లో 70-80% రేంజ్ లో ఆక్యుపెన్సీ అలాగే ఇంకొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.
దాంతో సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నా కానీ హౌస్ ఫుల్ బోర్డులను వర్షాలు పడుతున్నా కానీ సొంతం చేసుకుని రామ్ తన మాస్ పవర్ ని క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీని నిరూపించుకున్నాడు. కానీ వర్షాల ఇంపాక్ట్ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఇబ్బంది పెట్టేలా ఉన్నప్పటికీ మొత్తం మీద బుకింగ్స్ నిరాశ ని కలిగించినా కానీ హౌస్ ఫుల్ బోర్డులతో ది వారియర్ సినిమా…
మంచి స్టార్ట్ నే అందుకునేలా ఉందని చెప్పాలి. ఇక సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా రామ్ మాస్ పవర్ వీకెండ్ వరకు సాలిడ్ గా ఉంటే బిజినెస్ లో చాలా మొత్తాన్ని సినిమా వీకెండ్ లో అందుకునే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక.