Home న్యూస్ ఫస్ట్ లుక్ కే ఈ రేంజ్ క్రేజ్….రామ్ ది వారియర్ కి హిందీలో సెన్సేషనల్ రేటు!

ఫస్ట్ లుక్ కే ఈ రేంజ్ క్రేజ్….రామ్ ది వారియర్ కి హిందీలో సెన్సేషనల్ రేటు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మాస్ ఇమేజ్ ను ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సొంతం చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర రెడ్ మూవీ తో కూడా దుమ్ము లేపాడు….. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఇంప్రెస్ చేయక పోయినా కానీ మిక్సుడ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది…

RED The Film 8 Days Total Worldwide Collections!

ఈ సినిమా తర్వాత రామ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కోలివుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తమిళ్ తో పాటు తెలుగు లో ఏక కాలంలో రూపొందుతూ ఉండగా ఈ సినిమా కి అఫీషియల్ టైటిల్ ను ది వారియర్ గా పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా….

RED The Film 10 Days Total Worldwide Collections!

రిలీజ్ చేయగా పోస్టర్ లో పోలిస్ గెటప్ లో రామ్ మాస్ లుక్ పోస్టర్ సినిమా పై బజ్ ను సాలిడ్ గానే క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఆ బజ్ ఇప్పుడు సినిమా బిజినెస్ ఎక్స్ లెంట్ గా జరగడానికి ఉపయోగ పడుతుంది కూడా… రీసెంట్ గా సినిమా….

హిందీ డబ్బింగ్ అండ్ శాటిలైట్ రైట్స్ అమ్మడు పోయాయి. రామ్ నటించిన సినిమాలు హిందీ లో కూడా క్రమం తప్పకుండా డబ్ అవుతూ యూట్యూబ్ లో సెన్సేషనల్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ది వారియర్ మూవీ కి హిందీ డబ్బింగ్ అండ్ శాటిలైట్ రైట్స్ కింద ఏకంగా 16 కోట్ల రేటు సొంతం అయ్యిందని సమచారం….

ఈ రేంజ్ రేటు అది కూడా జస్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన ఇంపాక్ట్ చూసి సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు తెలుగు తమిళ్ లో రాబోతుంది. మరి ఈ సినిమా తో రామ్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….

Ram Pothineni Warriorr Hindi Dubbing Rights Sold For Sensational Price

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here