Home న్యూస్ ఉస్తాద్ రామ్ 103….రాజ్ తరుణ్ 108…టాలీవుడ్ లో నయా ట్రెండ్!

ఉస్తాద్ రామ్ 103….రాజ్ తరుణ్ 108…టాలీవుడ్ లో నయా ట్రెండ్!

0

సినిమా ప్రమోషన్ కి కాదేది అతీతం అని చెప్పొచ్చు….ఎన్ని రోజులు ఆడాయి అన్న పోస్టర్ లు, కలెక్షన్స్ రికార్డులు, టీసర్ లు ట్రైలర్ ల వ్యూస్ అండ్ లైక్స్, ట్విట్టర్ ఇంస్టలో పోస్ట్స్ కి వచ్చే లైక్స్ అండ్ రీట్వీట్స్, యూట్యూబ్ లో ఎంత సేపు వీడియో ట్రెండ్ అయింది, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ లో ఎన్ని వ్యూస్ అండ్ స్ట్రీమింగ్ మినట్స్…

ఇలా సినిమాల ప్రమోషన్స్ ఎన్నో విధాలుగా చేసుకుంటూ ఉండగా ఇప్పుడు వీటితో పాటు ఓవరాల్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో వచ్చే ఇంప్రెషన్స్ ని కూడా ప్రమోషన్స్ కి వాడుకుంటున్నారు…లేటెస్ట్ గా రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) సినిమా టీసర్ ను రిలీజ్ చేసే టైంలో…

టోటల్ సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ ఫామ్స్ లో కలిపి తక్కువ టైంలో ఏకంగా 103 మిలియన్స్ ఇంప్రెషన్స్ ను సొంతం చేసుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు…ఆ టీసర్ వచ్చిన కొన్ని రోజులకే  రాజ్ తరుణ్(Raj Tarun) నటిస్తున్న అప్ కమింగ్ అయిన  పురుషోత్తముడు(Purushothamudu Movie) సినిమా టీసర్ ను కూడా రిలీజ్ చేయగా…

ఆ టీసర్ కి కూడా మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా టోటల్ సోషల్ మీడియాలో ఈ టీసర్ వైరల్ అయింది, ఏకంగా 108 మిలియన్ ఇంప్రెషన్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. ఫామ్ లో లేకపోయినా రామ్ మూవీకి పోటిగా దుమ్ము లేపింది రాజ్ తరుణ్ మూవీ….టాలీవుడ్ లో ప్రమోషన్స్ కి కొత్త ట్రెండ్ దొరకగా అప్ కమింగ్ బిగ్ మూవీస్ కి కూడా ఈ ప్రమోషన్ ను వాడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఇవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here