బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో వచ్చిన రెండు కొత్త సినిమాలు రామ బాణం మరియు ఉగ్రం సినిమాలు రెండో కూడా మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి రిలీజ్ అవ్వగా ఉగ్రం మూవీ 6.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా రామబాణం సినిమా 15.20 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది…
2 సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ముందే మొదలు అయినా కూడా ఏమాత్రం బుకింగ్స్ జోరు లేక పోవడంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన సినిమాలు రెండూ కూడా కౌంటర్ టికెట్ సేల్స్ నే ఎక్కువగా నమ్ముకున్నాయి. ఉన్నంతలో గోపీచంద్ రామ బాణం సినిమా….
కొంచం బెటర్ గా ఓపెన్ అవ్వగా ఉగ్రం మూవీ మ్యాట్నీ షోల నుండి మెల్లిమెల్లిగా జోరు చూపిస్తుంది. మొత్తం మీద బుకింగ్స్ ట్రెండ్ ని ట్రాక్ చేసిన ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను గమనిస్తుంటే రామబాణం సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల నుండి…
1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఉగ్రం మూవీ మొదటి రోజు 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.