Home న్యూస్ గేమ్ చేంజర్….రా మచ్చ మచ్చ సాంగ్ రివ్యూ….కుమ్మిందిగా సాంగ్!!

గేమ్ చేంజర్….రా మచ్చ మచ్చ సాంగ్ రివ్యూ….కుమ్మిందిగా సాంగ్!!

0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్ ల క్రేజీ కాంబోలో చాలా టైంగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు సినిమా వస్తుంది అని అంటూ ఉండగా సినిమా నుండి ఆల్ రెడీ…

జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా నుండి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు….రా మచ్చ మచ్చ(Raa Macha Macha – Lyrical) పేరుతో రూపొందిన ఈ సాంగ్ సినిమాలో…

రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ గా ఉండబోతుండగా…తమన్ అందించిన మ్యూజిక్ ఫస్ట్ టైం విన్నప్పుడే బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక రామ్ చరణ్ ధృవ టైం లుక్స్ ని మళ్ళీ ఈ సినిమా కోసం ఫాలో అయినట్లు తెలుస్తూ ఉండగా ఆ లుక్ కూడా బాగా సెట్ అయ్యింది…

ఇక సాంగ్ లో రామ్ చరణ్ స్టెప్స్ సింపుల్ గా ఉన్నా బాగానే ఆకట్టుకున్నాయి…ఇక విజువల్స్, గ్రాండియర్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా విజువల్స్ పరంగా భారీ బడ్జెట్ తోనే ఈ సాంగ్ ను రూపొంచారు అనిపిస్తుంది. ఓవరాల్ గా సాంగ్ రిపీట్ లో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి…

శంకర్ కూడా తన కెరీర్ మొత్తం మీద హీరో ఇంట్రో సాంగ్ ను ఎప్పుడూ చేయలేదని ఫస్ట్ టైం రామ్ చరణ్ కోసమే ఈ సాంగ్ ను రూపొంచామని చెప్పారు…విజువల్స్ పూర్తిగా చూపించలేదు కానీ థియేటర్స్ లో సాంగ్ చూసే టైంలో ఆడియన్స్ లో మంచి థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయమని చెప్పాలి.. ఇక సాంగ్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here