Home న్యూస్ హిందీ లో రామరాజు ఫర్ భీమ్ టీసర్ రెస్పాన్స్…అరాచకం క్రేజ్ ఇది!!

హిందీ లో రామరాజు ఫర్ భీమ్ టీసర్ రెస్పాన్స్…అరాచకం క్రేజ్ ఇది!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కి అన్ని చోట్ల నుండి అల్టిమేట్ రెస్పాన్స్ రావడమే కాకుండా యునానిమస్ రికార్డులను చాలా నే సొంతం చేసుకుంది. కాగా తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందా అన్నది ఆసక్తిగా మారగా..

ఎట్టకేలకు టీసర్ భారీ డిలే తర్వాత రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సంచలన రికార్డులతో దూసుకు పోతున్న ఈ టీసర్ పాత రికార్డులను అన్నీ బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతుండటం విశేషం అని చెప్పాలి. తెలుగు లో అల్టిమేట్ క్రేజ్ ఉండటం తో…

రికార్డులు సాలిడ్ గానే వస్తూ ఉండగా హిందీ లో సినిమా టీసర్ క్రేజ్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా హిందీ లో ప్రస్తుతం పరిస్థితులు అంత బాలేకున్నా కానీ టీసర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ లభిస్తుంది, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ హిందీ లో మరింత బేస్ తో ఉండి మెప్పించాగా…

ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు డబ్ మూవీస్ తోనే చూసిన వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా కొత్త సినిమాలో చూడగా యునానిమస్ గా పాజిటివ్ రేస్పాస్ ఇస్తున్నారు. కొందరు టీసర్ లో కొన్ని షాట్స్ ఇలా ఎందుకు పెట్టారు అని కామెంట్స్ చేస్తున్నా కానీ ఎన్టీఆర్ లుక్ పై కానీ ఫిజిక్ పై కానీ… స్క్రీన్ ప్రజెన్స్ విషయం లో కానీ…

ఎలాంటి వంక పెట్టకుండా సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు, ఇక జక్కన్న సినిమా అవ్వడం తో నార్త్ ఆడియన్స్ అందరికన్నా ఎక్కువగా రాజమౌళి సినిమా కాబట్టి ఎలాగున్నా చూడాలి అని డిసైడ్ అయినట్లే కనిపిస్తున్నారు. రిలీజ్ టైం లో ఇదే జోష్ ఉంటే కచ్చితంగా సినిమా అక్కడ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here