రవితేజ లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ రీసెంట్ గా 18 కోట్ల టార్గెట్ తో 1000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక పోయింది. మొత్తం మీద 3.4 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న సినిమా రెండో రోజుకి టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఏమాత్రం హోల్డ్ లేదనే చెప్పాలి. ఇక ట్రాక్ చేసిన కొన్ని ఆఫ్ లైన్…
సెంటర్స్ లో సినిమా ఆల్ మోస్ట్ 60% కి అటూ ఇటూగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి… దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ ని ఓ రేంజ్ లో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ అది జరిగే అవకాశం అయితే…
కొంచం తక్కువగానే కనిపిస్తూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే మొత్తం మీద…
1.3 కోట్ల రేంజ్ నుండి 1.4 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా హోల్డ్ చేసింది అని చెప్పడానికి మినిమమ్ 2.2 కోట్ల నుండి 2.5 కోట్ల మధ్యలో సినిమా షేర్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లోనే సినిమా అన్ని చోట్లా కలెక్షన్స్ ని….
అందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితిని చూస్తుంటే అది అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా మొత్తం మీద సినిమా రవితేజకే కాదు టాలీవుడ్ కి రీసెంట్ టైం లో మరో నిరాశ పరిచే రిజల్ట్ ని ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమాగా చెప్పొచ్చు. డే 2 ఎండ్ అయ్యే టైం కి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.