తన సినిమా మీద కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు లేక… కాంట్రవర్సీ కామెంట్స్ తో నెగటివ్ టాక్ ని తగ్గించే ప్రయత్నం కావొచ్చు కానీ రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా డైరెక్టర్ శరత్ మందావ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తన సినిమాకి నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయినా ఎవరూ పట్టించుకోకూడదు అని చేశాడో…. లేక తన ప్రాడక్ట్ పై…
ఫుల్ నమ్మకంతో చేశాడో తెలియదు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్విట్టర్ రివ్యూ చూసి సినిమాలకు మాత్రం వెళ్లొద్దని ట్విట్టర్ లో పిట్టలు రెట్టలు వేస్తుంటాయనీ, అందులో ఏ విధమైనటువంటి మంచి ఉండదని సినిమాల విషయంలో కూడా కొందరు…..
కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్వీట్లు చేస్తుంటారని ఈయన ఆరోపించారు. సినిమా నచ్చక పొతే మధ్యాహ్నం టైంకే టాక్ వస్తుందని, కానీ ట్వీట్స్ చూసి సినిమాకి వెళ్ళకండి అంటూ కామెంట్స్ చేశాడు. ఇందులో కూడా కొద్ది శాతం నిజం ఉంది. ఒక సినిమా పై ద్వేషం ఉంటే ఆ సినిమా రిలీజ్ రోజున ఉదయం టైంకే నెగటివ్ టాప్ స్ప్రెడ్ అవుతుంది…
కానీ అదే టైంలో అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలకు టాక్ ఉదయమే పాజిటివ్ గా వస్తే ఆ సినిమా జోరు మరో లెవల్ లో ఉంటుంది. అలా అని ట్విట్టర్ లో సినిమాలు చూసి కామెంట్స్ పెట్టెవాళ్ళని, రివ్యూలు ఇచ్చే వాళ్ళని ఎవ్వరూ ఆపాలేరు అనే చెప్పాలి. ఇప్పుడు సినిమా డిసాస్టర్ టాక్ ని తెచ్చుకోవడంతో…. మామూలు సినీ లవర్స్ తో పాటు…
ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ కూడా ఈ డైరెక్టర్ ని ట్విట్టర్ లో చెడుగుడు ఆడేసుకున్నారు. మా హీరో ఛాన్స్ ఇస్తే ఇదా నువ్వు తీసింది అంటూ ఘాటు కామెంట్స్ చేశారు… దాంతో చేసేదేమీ లేక తన ట్విట్టర్ హ్యాండిల్ ని లాక్ చేసుకుని సైలెంట్ అయిపోయాడు ఈ డైరెక్టర్… సోషల్ మీడియా ఒక సినిమా బాగుంటే ఎంత రీచ్ ఇస్తుందో… బాలేక పొతే అదే విధంగా తొక్కేస్తుంది కూడా…. ఇది తెలుసుకుని సైలెంట్ గా ఉంటే ఇంత నెగటివిటీ ఉండేది కాదని చెప్పొచ్చు ఇప్పుడు.