Home న్యూస్ రామారావ్ ఆన్ డ్యూటీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

రామారావ్ ఆన్ డ్యూటీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాక్ తో సెన్సేషనల్ కంబ్యాక్ సొంతం చేసుకున్నా తిరిగి ఖిలాడితో నిరాశ పరిచిన రవితేజ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాతో వచ్చేశాడు…. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై అంచనాలు పెరగగా వరల్డ్ వైడ్ గా భారీగానే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుని మెప్పించిందో తెలుసు కుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్ అయిన హీరో కొన్ని కారణాల వలన ఆ పదవి వదిలి చిత్తూరుకి అధికారిగా వస్తాడు. అక్కడ వివిధ ప్రాంతాల పేద ప్రజలు పనిచేయడానికి వెళ్లి అక్కడ నుండి మిస్ అయిపోవడంతో ఆ కేసుని టేఫ్ ఆఫ్ చేస్తాడు…. తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ పాయింట్….

పెర్ఫార్మెన్స్ పరంగా రవితేజ తన వరకు అద్బుతంగా నటించి మెప్పించాడు కానీ కథలో దమ్ము లేక పోవడంతో తన కష్టం వృదా అయింది… హీరోయిజం ఎలివేట్ సీన్స్ కొన్ని బాగుండగా ఓవరాల్ గా రవితేజ తప్పితే మిగిలిన క్యారెక్టర్స్ ఏవి కూడా అనుకున్న విధంగా లేవు, హీరోయిన్స్ జస్ట్ ఓకే అనిపించుకోగా వేణు పాత్ర కూడా యావరేజ్ గానే ఉంది.

ఇక సంగీతం జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుండి… ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నీరసంగా ఉండగా చాలా సన్నివేశాలు సహనానికి పరీక్షగా నిలిచాయి. ఇక సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే శరత్ మండవ….

సినిమాను అనుకున్న విధంగా హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు, రవితేజ ఇంట్రో సీన్స్ కొంచం బాగున్నప్పటికీ తర్వాత కథ నత్తనడకన సాగి, ఏమాత్రం ఆసక్తిని కలిగించలేని ఇంటర్వెల్ తో ఫస్టాఫ్ కే నీరసం తెప్పించగా సెకెండ్ ఆఫ్ లో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అలాగే హీరోయిజం ఎలివేట్ అయ్యే ఫైట్ సీన్స్ తప్పితే మిగిలిన అన్ని విషయంలో నిరాశ పరిచాడు….

మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రవితేజ పెర్ఫార్మెన్స్, 2 సాంగ్స్, ఫైట్ సీన్స్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్లో నరేషన్, వీక్ స్క్రీన్ ప్లే, వీక్ డైరెక్షన్ ఇలా మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి…

ఉన్నంతలో రవితేజ కోసం కొంచం ఓపిక చేసుకుని చూస్తె సినిమా ఎదో పర్వాలేదు అనిపించవచ్చు కానీ మొత్తం మీద రవితేజ నుండి ఫ్యాన్స్ కానీ కామన్ ఆడియన్స్ కానీ ఆశించిన సినిమా అయితే ఇది కాదనే చెప్పాలి…. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here