Home న్యూస్ రామారావ్ ఆన్ డ్యూటీ ట్రైలర్ రివ్యూ….ఈ రేంజ్ ఎక్స్ పెర్ట్ చేయలేదు!!

రామారావ్ ఆన్ డ్యూటీ ట్రైలర్ రివ్యూ….ఈ రేంజ్ ఎక్స్ పెర్ట్ చేయలేదు!!

0

మాస్ మహారాజ్ రవితేజ నుండి ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ…. డిఫెరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్స్ వరకు అయితే బాగానే ఇంప్రెస్ చేసినా క్రాక్ రేంజ్ లో అయితే టీసర్ కానీ సాంగ్స్ కి రీచ్ అందుకోలేదు. కానీ మెల్లిమెల్లిగా హైప్ పెరుగుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…. ట్రైలర్ రిలీజ్ కి ముందు…

కొంచం డౌట్స్ సినిమా పై ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ తర్వాత అవన్నీ పటాపంచలు అయ్యి సినిమా పై పాజిటివ్ ఇంప్రెషన్ పెరిగిపోయింది అని చెప్పొచ్చు. రవితేజ నుండి కంప్లీట్ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీని మనం ఈ సినిమా చూడబోతున్నామని ట్రైలర్ కన్ఫాం చేసింది అని చెప్పొచ్చు….

ఒక మైన్ లో వివిధ ప్రాంతాల పేద ప్రజలు పనిచేయడానికి వెళ్లి అక్కడ నుండి మిస్ అయిపోవడం, ఆ ఊరికి కలెక్టర్ కం MRO గా రెండు పదవులు ఒక్కడే చేయడానికి వచ్చిన హీరో కొంత సమయం వరకు సిన్సియర్ గా వాళ్ళ కోసం ట్రై చేసినా అది ఫలించక పోవడంతో రూట్ మార్చి….

వాళ్ళని వెతికే పనిలో పడటం, తర్వాత వెలుగు చూసిన నిజాలు ఏంటి అన్న కాన్సెప్ట్ తో వస్తున్న రామారావ్ ఆన్ డ్యూటీ ట్రైలర్ చాలా బాగా ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేయడం వలన డైలాగ్స్ క్లియర్ గా వినిపించలేదు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇంపాక్ట్ ఫుల్ గా లేక పోవడం చిన్న మైనస్ అని చెప్పాలి.

ఇదొక్కటి తప్పితే ట్రైలర్ సినిమా పై ఎక్స్ పెర్టేషన్స్ ని భారీగా పెంచేసింది అని చెప్పాలి… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల 29న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా, సినిమా కూడా ఇదే రేంజ్ లో ఇంప్రెస్ చేస్తే ఇక మాస్ మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here