మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఖిలాడి లాంటి డిసాస్టర్ మూవీ తర్వాత చేస్తున్న లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ…. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై ట్రేడ్ లో మంచి పాజిటివ్ అంచనాలు ఏర్పడగా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా హిట్ అవ్వలాని అందరూ ఆశిస్తున్నారు. వరుస పెట్టి పరాజయాలతో ఈ నెల మొత్తం చాలా చప్పగా సాగింది అని చెప్పాలి.
ఇలాంటి టైం లో తిరిగి బాక్స్ అఫీస్ దగ్గర ఎదో ఒక సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేయాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఆ భాద్యత ఇప్పుడు రవితేజ మీద పడింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో…..
రవితేజ కి ఖిలాడి లాంటి ఫ్లాఫ్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందో లేదో అన్న ఆసక్తి ఉన్న నేపధ్యంలో బిజినెస్ పరంగా మాత్రం చాలా వరకు రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… టాక్ వస్తే ఈజీగా ఈ టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.
ఒకసారి టోటల్ వరల్డ్ వైడ్ గా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే…
👉Nizam – 5Cr
👉Ceeded – 3Cr
👉Andhra – 7Cr
AP TG:- 15.00Cr
👉Ka+ROI – 1Cr
👉OS – 1.2Cr
Total WW:- 17.20Cr
ఇదీ మొత్తం మీద ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు…
ఇక సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మొత్తం మీద 18 కోట్ల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న టైం లో జనాలు ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పిస్తుందో చూడాలి.