మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్(Ram Charan) తన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) రికార్డుల జాతర సృష్టిస్తాడు అనుకున్నా కూడా…ఓపెనింగ్స్ మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన అనుకున్న అంచనాలను అయితే అందుకోలేక పోయాయి…. అయినా కూడా సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఓవరాల్ గా..
ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది….మంచి టాక్ వచ్చి ఉంటే ఓవరాల్ గా కలెక్షన్స్ ఇంకా పెరిగి ఉండేవి…మొత్తం మీద మొదటి రోజున 39.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా కి ఇందులో ఓవరాల్ గా 7.46 కోట్ల రేంజ్ లో హైర్స్ కూడా…
కలిసి వచ్చాయి…ఓవరాల్ గా రామ్ చరణ్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయగా ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 74.11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని టాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా కొనసాగుతుంది…. ఒకసారి రామ్ చరణ్ రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్ ని గమనిస్తే..
#RamCharan Recent Movies 1st Day AP TG Shares
👉#GameChanger – 39.52CR*******
👉#Acharya(Multi Starrer) – 29.50CR
👉#RRR(Multi Starrer) – 74.11CR
👉#VinayaVidheyaRama – 25.99CR
👉#Rangasthalam – 19.50CR+
👉#Dhruva – 10.40CR~
మొత్తం మీద 6 ఏళ్ల క్రితం వచ్చిన వినయ విదేయ రామ మీద 13.50 కోట్లకు పైగా లీడ్ అయితే వచ్చినప్పటికీ గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఇంకా చాలా బెటర్ గ్రోత్ ని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు….కానీ మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన సినిమా అండర్ పెర్ఫార్మ్ చేసింది…ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన…
మాసివ్ 122 కోట్ల బిజినెస్ ను ఈ సంక్రాంతి సెలవులలో ఇతర సినిమాల మధ్య పోటి ని తట్టుకుని ఎంతవరకు రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు….టాక్ ఎలా ఉన్నా హిందీ బుకింగ్స్ ట్రెండ్ బాగుండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరింతగా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.