Home గాసిప్స్ రామ్ చరణ్ తో కోలివుడ్ క్రేజీ డైరెక్టర్…నిజం అయితే రంగస్థలంని మించే సినిమా ఖాయం!

రామ్ చరణ్ తో కోలివుడ్ క్రేజీ డైరెక్టర్…నిజం అయితే రంగస్థలంని మించే సినిమా ఖాయం!

0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR Movie తో పాన్ ఇండియా రేంజ్ లో సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆచార్య(Acharya) లో కీలక రోల్ చేయగా ఆ సినిమా భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్(Shankar) డైరెక్షన్ లో గేమ్ చేంజర్(Game Changer Movie) మూవీ…

చేస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా తో పాటు ఇప్పుడు ఉప్పెన(Uppena Movie) డైరెక్టర్ బుచ్చిబాబు సనా తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తూ ఉండగా ఈ సినిమా ఊరమాస్ గా ఉంటుంది అన్న టాక్ ఉండగా ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా వేటలో ఆల్ రెడీ ఉన్న రామ్ చరణ్ కి పలు డైరెక్టర్స్ ఆల్ రెడీ కథలను వినిపించగా…

రీసెంట్ గా కోలివుడ్ లో క్రేజీ రా రస్టిక్ మూవీస్ చేస్తాడు అన్న పేరున్న డైరెక్టర్ రీసెంట్ గా రామ్ చరణ్ కి కథని వినిపించినట్లు వార్తలు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా చక్కర్లు కొడుతున్నాయి…ఆ డైరెక్టర్ మరెవరో కాదు వాడా చెన్నై, అసురన్ లాంటి ఊరమాస్ రా రస్టిక్ మూవీస్ తీసిన వెట్రిమారన్(VetriMaran Movie with Ram Charan)…రీసెంట్ గా…

రామ్ చరణ్ ని కలిసి కథని వినిపించినట్లు తెలుస్తుంది….మన దగ్గర వచ్చిన రంగస్థలం(Rangasthalam Movie) సినిమా రా రస్టిక్ నేపధ్యంలో తెరకెక్కగా అలాంటి మూవీస్ ని మరో లెవల్ లో తీసే డైరెక్టర్ గా వెట్రిమారన్ కి పేరుంది…మరి అలాంటి డైరెక్టర్ తో ఇప్పుడు రామ్ చరణ్ మూవీ అంటే మాత్రం…

ఓ రేంజ్ లో నాటుగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది, వెట్రిమారన్ మూవీస్ ఎంత రా రస్టిక్ గా ఉంటాయో, ఆ సినిమాలలో హీరోల పెర్ఫార్మెన్స్ కి అంత మంచి పేరు అలాగే అవార్డులు కూడా భారీగా వస్తాయి. అలాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ కన్ఫాం అయితే బాక్ టు బాక్ ఊరమాస్ మూవీస్ తో తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here