బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటున్న అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ రామ్ సేతు…. మంచి స్టొరీ పాయింట్ ని తీసుకున్నా అనుకున్న రేంజ్ లో సినిమా ఆడియన్స్ ను అలరించలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఎదురుదెబ్బ కొట్టింది. సినిమా కచ్చితంగా అక్షయ్ కుమార్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీ గా….
నిలుస్తుంది అని అందరూ అనుకున్నా కానీ అలాంటిదేమీ జరగలేదు, ఈ సినిమా కోసం ఏకంగా మేకర్స్ 150 కోట్ల రేంజ్ బడ్జెట్ ని కేటాయించగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 11 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి కేవలం…
67 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని సాధించింది. అందులో 11 వ రోజు కేవలం 1 కోటి నెట్ కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా కేవలం 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే ఇప్పటి వరకు రికవరీ చేయగలిగింది.
బడ్జెట్ పరంగా చూసుకుంటే సినిమా ఇప్పటి వరకు థియేట్రికల్ షేర్ 43 కోట్ల రేంజ్ లోనే రికవరీ చేయగా మినిమమ్ అంచనాలను కూడా అందుకోలేక భారీ డిసాస్టర్ గా సినిమా నిలిచింది అని చెప్పాలి. ఈ వీకెండ్ లో అయినా సినిమా ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి.