Home న్యూస్ 24 గంటలు ఓవర్…రానా గ్లిమ్స్ కి ఊరమాస్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్…రానా గ్లిమ్స్ కి ఊరమాస్ రెస్పాన్స్!!

845
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోశియుం సినిమా తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరిగి పోతున్నాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ ముందుగా రిలీజ్ అయ్యి సంచలన రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అదే రేంజ్ లో ఊచకోత కోసింది…

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా సినిమాలో రానా దగ్గుబాటి క్యారెక్టర్ ఇంట్రో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో రానా డైలాగ్ కానీ బాడీ మాడ్యులేషన్ కానీ సాలిడ్ గా ఇంప్రెస్ చేశాయి అని చెప్పాలి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎప్పటి లానే కుమ్మేసింది. గ్లిమ్స్ లో…

రానా నిత్యామీనన్ తో మీ ఆయన గబ్బర్ సింగ్ అంట కదా… స్టేషన్ లో అంటున్నారు, నేను ధర్మేంద్ర ది హీరో అంటూ చెప్పిన డైలాగ్ మెప్పించింది. ఇక ఈ గ్లిమ్స్ 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 4.66 మిలియన్ మార్క్ ని అందుకోగా…

లైక్స్ 24 గంటల్లో 360.2K లైక్స్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ రెస్పాన్స్ తో టాలీవుడ్ టాప్ గ్లిమ్స్ రికార్డులలో ఒకటిగా నిలిచింది. ఒకసారి ఆ రికార్డులను గమనిస్తే…👉#BheemlaNayak – 8.49M
👉#SyeRaa – 7.2M
👉#RadheShyam – 5.07M
👉#BLITZofDANIELSHEKAR – 4.669M****
👉#SPYder – 4.2M
👉#Maharshi – 2.9M
ఇక టాప్ లైక్స్ గ్లిమ్స్ ను గమనిస్తే..
👉#BheemlaNayak – 728.6K
👉#RadheShyam- 394.4K
👉#BLITZofDANIELSHEKAR – 360.2K****
👉#Syeraa – 287K
👉#HariHaraVeeraMallu – 219.7K
👉#SPYder – 190K

ఇదీ ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ సొంతం చేసుకున్న సెన్సేషనల్ రెస్పాన్స్… రానా కెరీర్ లో ఆల్ టైం బెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకున్న ఈ గ్లిమ్స్ తో సినిమా పై ఉన్న అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇక సినిమా వచ్చే సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయడం ఖాయం అని ఈ రెస్పాన్స్ చూస్తె అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here