కొన్ని కొన్ని సార్లు సినిమా రిజల్ట్ కోసం కొన్ని కటిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, ఈ సినిమా కి వీళ్ళు అయితే బాగుంటారనో, వీళ్ళ వల్ల సినిమా కి మరింత ప్లస్ అవుతుందనో కొన్ని సార్లు అనుకోకుండా కూడా ఒక సినిమా లో ముందు ఒకరిని అనుకుని చివరి కి మరొకరిని ఆ ప్లేస్ లో తీసుకుని సినిమాలు చేస్తూ ఉంటారు, రీసెంట్ గా ఈ కోవ లోకే చేరుకునే సినిమా విరాట పర్వం…
రానా సాయి పల్లవి ప్రియమణి లాంటి మంచి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో మంచి బజ్ ఉందని చెప్పొచ్చు. బాహుబలి తో నేషనల్ స్టార్ అయినా కానీ చాయిస్ మేరకే సినిమాలు చేస్తున్న రానా ఈ సినిమా లో నక్సలైట్ గా నటిస్తున్నాడు.
కానీ సినిమా దర్శకుడు వేణు ఉడుగుల ఇది వరకు నీది నాదే ఒకే కథ అనే సినిమా తీయగా ఆ సినిమా కి రెస్పాన్స్ బాగానే వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు, అదే టైం లో ఈ సినిమా కథ రాసుకోవడం ఈ సినిమా తెలుగు తమిళ్ లో తీయాలి అని ఫిక్స్ అవ్వడం..
అందులో రానా రోల్ లో కోలివుడ్ హీరో సూర్య తమ్ముడు, తెలుగు వారికి సుపరిచితుడే అయిన కార్తీ ని అనుకున్నారట. కానీ ఆ టైం లో కార్తీ కి సరైన హిట్స్ లేక పోవడం తో మళ్ళీ రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని భావించి హీరో ని వెతకడం మొదలు పెట్టగా రానా పేరు వినిపించడం వెంటనే వెళ్లి సినిమా కథ చెప్పడం…
దానికి రానా కూడా సై అనడం తో ఈ సినిమా పట్టాలు ఎక్కిందట… 1990 కాలంలో ఉండే నక్సలైట్స్ మీద ఈ సినిమా ఉంటుందని అంటున్నారు… ఇప్పుడు కార్తీ నటించిన సుల్తాన్ ఇక్కడ ఫ్లాఫ్ గా నిలవగా రానా నటించిన అరణ్య సినిమా భారీ డిసాస్టర్ గా నిలిచింది, మరి ఇలాంటి టైం లో సెకెండ్ వేవ్ తర్వాత ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.