OTT కంపెనీ లు కొన్ని సినిమాల విషయం లో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి, అమెజాన్ ప్రైమ్ ఎంత రేటు పెట్టడానికి అయినా సిద్ధం అవుతూ వస్తున్నా మిగిలిన యాప్స్ మాత్రం రేట్ల విషయం లో ఏమాత్రం తొందర పడటం లేదు, ఆచి తూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉండగా జీ 5 వాళ్ళు కొత్తగా పే పెర్ వ్యూ పద్దతిలో సినిమాలను రిలీజ్ చేయడం మొదలు పెట్టగా రీసెంట్ గా….
ఈ పద్దతిలో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఒకటి బాలీవుడ్ మూవీ ఖాళీ పీలి కాగా మరోటి తమిళ్ లో విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ నటించిన కా పే రణ సింగం సినిమా.. ఖాళీ పీలి కి టికెట్ 299 రేటు పెట్టగా రణ సింగం సినిమా కి 199 రేటు పెట్టారు…
ఖాళీ పీలి ఫస్ట్ డే ఎన్ని టికెట్లు సోల్డ్ అయ్యాయి లాంటి వివరాలు ఇంకా రిలీజ్ అవ్వడం కానీ లీక్ అవ్వడం కానీ జరగలేదు కానీ రణ సింగం సినిమా మొదటి రోజు మొత్తం మీద ఎన్ని టికెట్లు తెగాయి అన్నది మాత్రం ట్రేడ్ లో కొన్ని లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆ లెక్కల ప్రకారం సినిమా కి మొదటి రోజు మొత్తం మీద 65 వేల నుండి 70 వేల రేంజ్ లో టికెట్ లు అఫీషియల్ గా సేల్ అయ్యాయని అంటున్నారు. ఇవీ పే పెర్ వ్యూ పద్దతిలో మొదటి రోజు హైయెస్ట్ వ్యూస్ అని కూడా ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు… ఇక ఈ టికెట్ సేల్స్ ద్వారా మొత్తం మీద…..
మొదటి రోజు జీ 5 ప్లెక్స్ యాప్ కి… 1.29 కోట్ల నుండి 1.39 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చని అంటున్నారు… ఇందులో 20% యాప్ కి 80% టీం కి వెళుతుంది అంటే… 1.1 కోట్ల మేర టీం కి… యాప్ కి 30 లక్షల మేర దక్కుతుందని ట్రేడ్ లో అనుకుంటున్నారు… ఇలా లాంగ్ రన్ ఎప్పటి వరకు ఉంటె అప్పటి వరకు కలెక్షన్స్ వస్తాయి అన్న మాట.. ఇక అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…