బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ 26 వీకెండ్ లో రెండు క్రేజీ సినిమాలు పోటి పడబోతున్నాయి, నితిన్ నటించిన రంగ్ దే సినిమా మరియు రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమాలు పోటి పడుతూ ఉండగా అరణ్య సినిమా సుమారు 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా రంగ్ దే సినిమా ఆల్ మోస్ట్ 610 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక రంగ్ దే సినిమా కి సాలిడ్ బిజినెస్ జరిగింది.
అరణ్య సినిమా బిజినెస్ లెక్కలు ఇంకా అఫీషియల్ గా బయటికి రావాల్సి ఉంది. మొత్తం మీద 60 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన అరణ్య మరియు భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న రంగ్ దే సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మూడు రోజుల ముందు నుండే…
స్టార్ట్ అవ్వగా రంగ్ దే కి బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి, ఇక అరణ్య సినిమా మౌత్ టాక్ పైనే ఎక్కువగా డిపెండ్ అయ్యి రిలీజ్ కాబోతుండగా రెండు సినిమాలకు ఇప్పుడు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కి గట్టి ఎదురుదెబ్బ తగలబోతుంది అని చెప్పాలి. దానికి కారణం డిల్లీలో ఇప్పుడు…
రైతులకు ప్రభుత్వానికి మధ్య గొడవ ఇంకా జరుగుతూ ఉండగా ఇప్పుడు 26 న భారత్ బంద్ చేయాలనీ రైతులు నిర్ణయం తీసుకున్నారు, అందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆల్ మోస్ట్ సపోర్ట్ ని ప్రకటించాయి. దాంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలకు ఎఫెక్ట్ గా మారబోతుంది. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది…
బంద్ ఎన్నో షోలకు ఎఫెక్ట్ చూపుతుంది అన్న దానిపై ఉంటుంది, చాలా చోట్ల మార్నింగ్ షోలకు, కొన్ని చోట్ల మ్యాట్నీ షోలకు కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు, దాంతో ఎటొచ్చి మొదటి రోజు కలెక్షన్స్ కి ఇది ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరి సినిమాలకు ఈ ఇంపాక్ట్ ఉంటుందా లేక నార్మల్ రిలీజ్ అవుతాయా అన్నది కొన్ని గంటల్లో తెలుస్తుంది అని చెప్పాలి.