బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భీష్మ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన నితిన్ తర్వాత చేస్తున్న సినిమా రంగ్ దే, ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్ మదిలో అటు డైరెక్ట్ రిలీజ్ వైపు ఇటు థియేటర్స్ లో రిలీజ్ వైపు అడుగులు ఎటు వేయాలా అన్న ప్రశ్నలు ఉండగా థియేటర్స్ లోనే సినిమా ను రిలీజ్ చేస్తామని కుదిరితే సంక్రాంతికి కలుద్దామని డైరెక్టర్ కన్ఫాం చేశాడు.
కానీ డైరెక్ట్ రిలీజ్ కి అద్బుతమైన ఆఫర్లు వస్తూ ఉండటం తో సినిమా ఇటు వైపు అడుగులు వేసే అవకాశం కూడా ఉండగా లేటెస్ట్ గా జీ ప్లెక్స్ వాళ్ళు సినిమా కి రికార్డ్ లెవల్ ఆఫర్ రేటు ఇవ్వగా యూనిట్ 40 కోట్ల రేంజ్ రేటు ని ఎక్స్ పెర్ట్ చేయడం తో కొత్త ఆఫర్ ఇచ్చారు…
పే పెర్ వ్యూ పద్దతిలో సినిమా ను రిలీజ్ చేద్దామని, మీరు 80% ఉంచుకోండి, రిలీజ్ చేసినందుకు 20% మాకు ఇవ్వండి అంటూ ఫైనల్ సెటిల్ మెంట్ చేయగా రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది తెలియక పోవడం తో హోల్డ్ లో పెట్టారు….
ఇక అక్టోబర్ 2 న రెండు సినిమాలు ఇలా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అవుతుండగా వాటి రిజల్ట్ ని బట్టి రంగ్ దే టీం ఫైనల్ డిసిషన్ ఉంటుందని తెలుస్తుంది, ఆల్ మోస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అనుకుంటున్నా కానీ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రావచ్చో లేదో అన్న డౌట్ కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ అక్టోబర్ 2 న పే పెర్ వ్యూ పద్దతిలో…
రిలీజ్ అవుతున్న ఖాళీ పీలి మరియు విజయ్ సేతుపతి సినిమాల రిజల్ట్ బాగా వస్తే ఈ పద్దతి లో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒకే సారి ప్రాఫిట్ రాదు, కొంచం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఫైనల్ నిర్ణయం నవంబర్ లో తెలిసే అవకాశం ఉందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.