Home న్యూస్ రంగ్ దే టీసర్ టాక్…మళ్ళీ హిట్ పక్కా!!

రంగ్ దే టీసర్ టాక్…మళ్ళీ హిట్ పక్కా!!

320
0

ఈ ఇయర్ ఫిబ్రవరి లో బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు యూత్ స్టార్ నితిన్. అ ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ విజయాన్ని అందుకోలేక పోయిన నితిన్ భీష్మ సినిమా తో అన్ సీజన్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా ఇప్పుడు తన కొత్త సినిమా రంగ్ దే తో ఆడియన్స్ ని అలరించ డానికి సిద్ధం అవుతున్నాడు.

కాగా రీసెంట్ గా నితిన్ పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయిన నేపధ్యంలో రంగ్ దే సినిమా టీసర్ ని సడెన్ సర్పైజ్ గా రిలీజ్ చేశారు. టీసర్ అని చెప్పకుండా సర్ప్రైజ్ అని డైరెక్ట్ గా టీసర్ నే రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తూనే…

నితిన్ మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండబోతుంది అంటూ జోక్ గా చెప్పుకొచ్చారు టీసర్ లో… సినిమా టీసర్ ఫ్రెష్ అండ్ క్యూట్ గా ఉందని చెప్పాలి. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకునే హీరో తర్వాత మ్యారేజ్ లైఫ్ లో ఇంటి పనులను చేస్తూ ఎలా లైఫ్ ని లీడ్ చేశాడు అన్నట్లు టీసర్ లో చూపెట్టారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీసర్ ఫస్ట్ ఇంప్రెషన్ లోనే మెప్పించే విధంగా ఉండగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని మళ్ళీ జరుపుకోబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇయర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని టీసర్ ఎండ్ లో మేకర్స్ తెలియజేశారు.

మరి అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది చెప్పలేం కానీ ఆ లోపు అన్నీ సద్దుకుంటే మళ్ళీ సంక్రాంతి నుండి కొత్త సినిమాల జోరు చూడచ్చు. లేదా సంక్రాంతి కి అనుకున్న సినిమాలు అన్నీ సమ్మర్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నితిన్ కి హ్యాప్పీ మ్యారేజ్ లైఫ్ విషెస్ మా విజిటర్స్ తరుపునుండి చెప్పేస్తున్నాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here