Home న్యూస్ 2015 సినిమా కథనే తీశారు…కానీ మళ్ళీ వర్కౌట్ అయింది!

2015 సినిమా కథనే తీశారు…కానీ మళ్ళీ వర్కౌట్ అయింది!

0

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో కిచ్చ సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా బెటర్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. కాగా సినిమా చూసిన ఆడియన్స్ 3D ఎఫెక్ట్స్ కి థ్రిల్ అవుతూ ఉండగా కథ కొంచం స్లోగా ఉన్నప్పటికీ కూడా క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అవ్వడంతో సినిమా ఓవరాల్ గా ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంది…

ఇదంతా కూడా ఇతర భాషల ఆడియన్స్ నుండి వస్తున్న టాక్ కాగా కన్నడ ఆడియన్స్ సినిమా ను చూసి ఇది ఆల్ మోస్ట్ 2015 టైం లో వచ్చిన ఇదే డైరెక్టర్ డైరెక్ట్ చేసిన రంగితరంగ సినిమాను పోలి ఉంటుందని కానీ ట్రీట్ మెంట్ కొంచం వేరుగా ప్లాన్ చేశారని అంటున్నారు…

చాలా మంది ఆ సినిమాను చూసి ఉండక పోవడంతో ఈ సినిమాలో జాతరలో ఫేస్ కి కలర్ వేసుకుని ఉన్నట్లు ఇందులో విలన్స్ కూడా మొఖానికి కలర్ వేసుకుని మర్డర్స్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ కొత్తగా అనిపించినా కానీ కన్నడలో ఈ సినిమా డైరెక్టర్ చేసిన రంగితరంగ సినిమా కూడా..

ఆల్ మోస్ట్ ఇదే పాయింట్ తో తెరకెక్కిన సినిమా… విక్రాంత్ రోణలో చిన్న పిల్లల్ని చంపితే ఆ సినిమాలో గర్బవతులను చంపుతాడు…. టోటల్ స్టొరీ కూడా ఈ సినిమాలో చెప్పినట్లు కొమరట్టు అనే ఊరిలోనే జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో సెకెండ్ హీరోగా నటించిన హీరోనే రంగితరంగలో హీరో…. ఆల్ మోస్ట్ సేమ్ స్టొరీ పాయింట్ తో బెటర్ క్వాలిటీ అండ్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ విత్…

ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో వచ్చిన విక్రాంత్ రోణ కూడా ఓవరాల్ గా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. రంగితరంగ చూసిన వాళ్ళకి అదే కాన్సెప్ట్ ను మరో యాంగిల్ లో చెప్పినట్లు అనిపించినా చూడనివాళ్ళకి మాత్రం డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వడంతో సక్సెస్ అయింది విక్రాంత్ రోణ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here