బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 7న రిలీజ్ అవుతుంది, సినిమా టీం సినిమాను మరీ అనుకున్న రేంజ్ లో అయితే ప్రమోషన్స్ చేయలేదు అనే చెప్పాలి. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ హడావుడి ఇంకా పెరగాలి కానీ ఇప్పటికి అయితే బజ్ చాలా చప్పగా ఉంది. కానీ బిజినెస్ పరంగా మాత్రం సినిమా మంచి బిజినెస్ నే…
మేజర్ ఏరియాలలో సొంతం చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా సినిమా ఆంధ్ర ఏరియా బిజినెస్ లెక్కలు బయటికి రాగా టోటల్ గా కోస్టల్ ఆంధ్ర రీజన్ కి గాను సినిమా 10 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు….
రవితేజ ప్రీవియస్ మూవీ ధమాకా 8 కోట్ల బిజినెస్ ను అందుకుంటే ఇప్పుడు 2 కోట్లు ఎక్కువ బిజినెస్ ను రావణాసుర సినిమా దక్కించుకోగా మిగిలిన ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ నే సినిమా సొంతం చేసుకోగా ఆ లెక్కలు అన్నీ త్వరలో రాబోతున్నాయి… ఓవరాల్ గా బిజినెస్ అయితే డీసెంట్ గానే జరగినా కానీ…
సినిమా బజ్ అయితే ఇంకా జోరు అందుకోవాల్సి ఉంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ ఇప్పుడు చాలా ముఖ్యం అని చెప్పాలి. టాక్ బాగుంటేనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమాతో మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా మెప్పిస్తాడో చూడాలి.