మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ చేస్తున్న ఈ సినిమా ఎక్స్ పెరిమెంటల్ మూవీ అవ్వడంతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ని పూర్తీ చేసుకున్న సినిమా కి అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటి అనేది కూడా బయటికి వచ్చేసింది. ఒకసారి ఆ టాక్ ఏంటి అనేది గమనిస్తే… స్టొరీ పాయింట్ ని ఏమాత్రం రివీల్ చేయడం లేదు కానీ…
ఒక లాయర్ అయిన హీరో తన కొలీగ్స్ తో సరదా సరదాగా ఉంటున్న టైంలో కొన్ని ఊహించని పరిణామాలు జరగడం, ఆ తర్వాత హీరో ఏం చేశాడు, అసలు ఇంతకీ హీరో విలనా హీరోనా అన్న ఆసక్తిని కలిగిస్తూ సాగే సినిమా కథ ఎలా ఉంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు….
సినిమా టేక్ ఆఫ్ కి కొంచం పట్టగా రవితేజ ఇంట్రో ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుందని, ఫస్టాఫ్ కథ కొంచం స్లోగా సాగినా ఎంటర్ టైన్ మెంట్ తో కూడుకుని పర్వాలేదు అనిపిస్తూ ప్రీ ఇంటర్వెల్ నుండి సీరియస్ టర్న్ తీసుకుని తర్వాత ఇంటర్వెల్ ఎపిసోడ్ మైండ్ బ్లాంక్ చేస్తూనే ఓ రేంజ్ లో బాగా మెప్పిస్తుందని సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచేలా ఉండే ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత…
కథ మరింత సీరియస్ గా టర్న్ తీసుకుంటుందని అంటున్నారు, సెకెండ్ ఆఫ్ లో కథ కొంచం అక్కడక్కడా స్లో అయినట్లు అనిపించినా ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ జోరు అందుకుంటుందని క్లైమాక్స్ మెప్పిస్తుందని అంటున్నారు… ఓవరాల్ గా స్టొరీ పాయింట్ డిఫెరెంట్ గా అనిపించినా కొంచం రొటీన్ ట్రీట్ మెంట్ ఉంటుందని అంటున్నారు…
మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో సెకెండ్ ఆఫ్ సీరియస్ స్టొరీతో కథ ఉంటుందని, రన్ టైం తక్కువ ఉండటం వలన కొంచం స్లో అయినా పర్వాలేదు అనిపించేలా కథ ఉంటుందని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొన్ని మెప్పించడం వలన సినిమా ఓవరాల్ గా ఈజీగా ఒకసారి చూసేలా అనిపించింది అని అంటున్నారు… మొత్తం మీద సినిమా కి ఎబో యావరేజ్ రేంజ్ లెవల్ లో టాక్ అయితే ప్రీమియర్స్ నుండి వినిపిస్తుంది, ఇక రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు.