Home న్యూస్ రావణాసుర రివ్యూ-రేటింగ్….ఇది ఎక్స్ పెర్ట్ చేయలేదు!!

రావణాసుర రివ్యూ-రేటింగ్….ఇది ఎక్స్ పెర్ట్ చేయలేదు!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ ఇప్పుడు రావణాసుర సినిమాతో ఎంతవరకు మెప్పిస్తాడు అన్నది ఆసక్తిగా మారగా సినిమా వివరాల లోకి వెళితే… ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి బస్తే… అసిస్టంట్ లాయర్ అయిన హీరో ఫారియా అబ్దుల్లా దగ్గర పని చేస్తూ ఉంటాడు… మేఘా ఆకాష్ ఒక మర్డర్ కేసుతో వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కేసుని టేక్ అప్ చేసిన తర్వాత… మరిన్ని మర్డర్ కేసుల గురించి తెలుస్తుంది..

వీటి మధ్య ఉన్న లింక్స్ ఏంటి, హీరో ఇవన్నీ ఎలా సాల్వ్ చేశాడు, హీరో ఇంతకి విలనా లేక హీరోనా అనే ఆసక్తి కరమైన విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా కథ పాయింట్ ఓవరాల్ గా డిఫెరెంట్ గా ఉన్నప్పటికీ వన్స్ అసలు మ్యాటర్ తెలిసిన తర్వాత కొంచం సిల్లీగా అనిపిస్తుంది… ఇక కథ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పట్టడం, మళ్ళీ సెకెండ్ ఆఫ్ లో కథ చాలా నెమ్మదిగా సాగినట్లు అనిపించడం, అలాగే ఆడియన్స్ ఊహలకు అనుగుణంగానే సెకెండ్ ఆఫ్ లో కొన్ని ట్విస్ట్ లు ఉండటం మైనస్ పాయింట్స్…

కానీ అదే టైంలో ఫారియాతో రవితేజ కొన్ని కామెడీ సీన్స్ మెప్పించడం, సుశాంత్ పెర్ఫార్మెన్స్ సెకెండ్ ఆఫ్ లో ఇంప్రెస్ చేయడం, కొన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించడం బాగుంది అనిపిస్తుంది… అన్నింటికీ మించి సినిమాలో రవితేజ పెర్ఫార్మెన్స్ చూసి శాకవ్వని వాళ్ళు ఉండరు అనే చెప్పాలి… ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి ఇంటర్వెల్ తర్వాత ఓ 20 నిమిషాల దాకా రవితేజ రోల్….

ఓ రేంజ్ లో మైండ్ బ్లాంక్ చేసేలా ఉంటుంది, ఇలాంటి రోల్ ఇతర స్టార్స్ చేయాలి అన్నా కూడా బయపడతారు… అలాంటి రోల్ ని అవలీలగా చేసేసి మెప్పించిన రవితేజ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, హీరోయిన్స్ అందరివీ చాలా చిన్న రోల్స్ కాగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపిస్తారు… ఇక సంగీతం జస్ట్ ఓకే అనిపించే విధంగా సాంగ్స్ సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డు పడ్డాయి, బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి చాలా బాగా ఇంప్రెస్ చేసేలా ఉంది… ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా డైరెక్షన్ విషయానికి వస్తే…

సుధీర్ వర్మ డిఫెరెంట్ స్టొరీని ఎంచుకుని చాలా వరకు డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఆడియన్స్ కి కలగజేశాడు కానీ స్టొరీ ఇంకా బాగా చెప్పే స్కోప్ ఉన్నా ఒక దశలో రొటీన్ ఫార్మాట్ లోనే నడపడంతో కొంచం ట్రాక్ తప్పాడు అనిపిస్తుంది… ఇక కొన్ని ట్విస్ట్ లు కూడా ఆడియన్స్ ఊహించినట్లే ఉండటం కూడా కొంచం ఇబ్బంది పెట్టినా రవితేజని మాత్రం ఈ రేంజ్ లో చూపిస్తాడు అని ఎవ్వరూ ఊహించి ఉండరు…. ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు…

ఈ సినిమా అందరి కోసం కాదు, ఫ్యాన్స్ కూడా ఒక స్టేజ్ లో రవితేజని ఇంత వైలేంట్ గా చూపించారు అనుకుంటారు, రొటీన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యి కొంచం డిఫెరెంట్ మూవీ ట్రై చేయాలి అనుకుంటే కొంచం బోర్ ఫీల్ అయినా రావణాసుర పార్టు పార్టులుగా మెప్పించి ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. మొత్తం మీద మరీ బాగుంది అని కాదు, అలా అని తీసి పారేసే సినిమా కాదు… మొత్తం మీద రవితేజ చేసిన ఈ ప్రయోగానికి 2.75 రేటింగ్ ఇస్తున్నాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here