Home న్యూస్ రావణాసుర ట్రైలర్ రివ్యూ….మరోసారి మాస్ జాతరే!!

రావణాసుర ట్రైలర్ రివ్యూ….మరోసారి మాస్ జాతరే!!

0

మాస్ మహారాజ్ రవితేజ ధమాకాతో సూపర్ ఫాంలోకి వచ్చేయగా వాల్తేరు వీరయ్య లో చేసిన స్పెషల్ రోల్ తో మరింత మంచి రీచ్ ను సొంతం చేసుకుని తన క్రేజ్ ని పెంచుకున్నాడు. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా రావణాసురతో రాబోతూ ఉండగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది, రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి…

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వినిపిస్తుందని చెప్పాలి… ట్రైలర్ స్టార్ట్ అవ్వడం ఫుల్ యాక్షన్ బ్లాక్స్ తో స్టార్ట్ అయ్యి లాయర్ గా రవితేజ పరిచయం తర్వాత తన ఫ్రెండ్స్ తో ఎలా చిల్ అవుతున్నాడు, కామెడీగా ఉండే కొన్ని కోర్టు సీన్స్ తో ఎంటర్ టైన్ మెంట్ సినిమాలో ఉందని చూపిస్తూ…

తర్వాత ఒక మర్డర్ చుట్టూ కథని నడిపి ఆ మర్డర్ కి లాయర్ అయిన హీరోకి ఉన్న లింక్ ఏంటి అన్న లైన్ తో మిగిలిన స్టొరీ ఉండగా ట్రైలర్ ఆసాంతం కూడా ఒక రకమైన క్యూరియాసిటీని మెయిన్ టైన్ చేశారు. ఓవరాల్ గా ముందు ఎక్స్ పెరి మెంటల్ మూవీలా అనిపించినా కానీ అన్ని…

ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ నిరూపించింది… సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలను భారీగా పెంచేసింది అని చెప్పాలి. టైట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుందని చెబుతూ ఉండటంతో సినిమా కూడా ట్రైలర్ రేంజ్ లో ఆకట్టుకుంటే కచ్చితంగా రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మాస్ జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here