మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత రీసెంట్ గా క్రాక్ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. ఇలాంటి టైం లో అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల విషయం లో మళ్ళీ మునుపటి జోరు చూపెడుతూ ఏడాదికి రెండు మూడు సినిమాలు మినిమమ్ చేసేలా పక్కా ప్లానింగ్ తో దూసుకు పోవాలని చూస్తున్నాడు రవితేజ…
ఈ క్రమం లో రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తుండగా తర్వాత కొత్త డైరెక్టర్ సాగర్ డైరెక్షన్ లో ఒక సినిమాను తర్వాత నేను లోకల్ ఫేం… త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో మరో సినిమాను కమిట్ అయిన రవితేజ ఇప్పుడు ఈ సినిమాల తర్వాత….
కెరీర్ లో 16 ఏళ్ల క్రితం ఓ అద్బుతమైన ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా చేసే అవకాశం ఎంతైనా ఉందని తెలుస్తుంది. వీళ్ళ కాంబినేషన్ లో 2005 టైం లో భద్ర సినిమా రాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా..
ఈ సినిమా కి తర్వాత టెలివిజన్ లో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు, మళ్ళీ రవితేజ ఇలాంటి సినిమా చేయాలని బోయపాటి కాంబో లో రవితేజ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు కానీ ఆల్ మోస్ట్ 16 ఏళ్ళు అవుతున్నా కానీ రవితేజ మరియు బోయపాటి శ్రీను లు ఇప్పటి వరకు మళ్ళీ ఎందుకో…
సినిమాను చేయలేదు, కానీ ఎట్టకేలకు ఇప్పుడు బోయపాటి శ్రీను బాలయ్య తో చేస్తున్న అఖండ సినిమా తర్వాత రవితేజ తో సినిమా చేసే అవకాశం ఉందని, కథ ని రీసెంట్ గా వినిపించారని అంటున్నారు, ఇది కనుక నిజం అయితే రవితేజ రీసెంట్ టైం లో క్రాక్ ని మించే రేంజ్ మాస్ మూవీ గా ఈ కాంబోలో వచ్చే సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.